అందం కోసం ఆ పని చేస్తా... హీరామండి బ్యూటీ అదితిరావు హైదరీ బ్యూటీ సీక్రెట్స్!!
సహజంగా వయసు పెరిగేకొద్దీ అందం తరిగిపోతూ ఉంటుంది. ముఖంమీద ముడతలు వస్తాయి. అయితే వయసుతోపాటు అందాన్ని పెంచుకోవాలని చాలామంది కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినవారు అందం వాళ్ళ జీన్స్ లోనే ఉందేమోనని అపోహ పడుతుంటారు. ఇక అలాంటివారికి అందం కోసం మంచి ఆహారాన్ని తీసుకుంటానని, బామ్మలకాలం నాటి చిట్కాలు ఫాలో అవుతానని తన సౌందర్య రహస్యాలను చెప్పారు హీరామండి బ్యూటీ అదితి రావు హైదరి.
గ్లూటెన్ ఉండే ఆహారాలకు దూరం
తన బ్యూటీ సీక్రెట్స్ చెబుతూ ఆమె చాలామంది తనను మీ సౌందర్య రహస్యం మీ జీన్స్ లో ఉందా? అని అడుగుతారని, కానీ నా సౌందర్య రహస్యం నేను తీసుకునే ఆహారంలోనూ, నేను పాటించే నియమాలను ఉందని చెబుతానని ఆమె చెప్తున్నారు. బామ్మల కాలం నాటి చిట్కాలను తాను పాటిస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారంలో గ్లూటెన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటానని చెబుతున్నారు.'

అందం కోసం ఆహారం
గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు చర్మాన్ని పొడిగా మారుస్తాయని, ముఖం మీద త్వరగా ముడతలు వచ్చేలా చేస్తాయని చెబుతున్నారు. అందుకే గ్లూటెన్ ఉన్న పదార్థాలు, పాల పదార్థాల బదులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బ్రౌన్ రైస్, పప్పులు, డ్రై ఫ్రూట్స్ వంటివి తను రోజువారి ఆహారంలో చేర్చుకుంటానని, వాటిని ఎక్కువగా తీసుకుంటానని చెబుతున్నారు.
చిన్నప్పటి నుండి ఓ అలవాటు కూడా అందంగా ఉండేందుకు కారణం
అంతేకాదు ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం తనకు చిన్ననాటి నుంచి అలవాటుగా మారిందని, ఆది తన చర్మాన్ని తేమగాను, హైడ్రేటెడ్ గాను, ప్రకాశవంతంగానూ మారుస్తుందని చెబుతున్నారు. ఇక ముఖంపై ఎప్పుడైనా మొటిమలు వస్తే గంధపు చెక్క అరగదీసిన చందనం పేస్ట్ ను మొటిమలపై అప్లై చేస్తానని చెబుతున్నారు.
ముఖంపై ముడతలు రాకుండా వాడేది ఇదే
అంతేకాదు 40 ఏళ్ల వయసులో కూడా ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి ఒక సీక్రెట్ ఉందని తాను హైఅల్యురోనిక్ ఆమ్లం యూజ్ చేస్తానని చెబుతున్నారు. ఇది ఒక ఫేస్ సీరమ్ అని దీనిని కనీసం రోజుకు రెండుసార్లు ముఖానికి అప్లై చేసుకుంటానని, ఇది వృద్ధాప్య ఛాయాలను దగ్గరకు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు అదితీరావ్ హైదరి.
అందంగా, వృద్ధాప్యం త్వరగా దగ్గరకు రాకుండా చెయ్యాల్సిందిదే
అదితీరావు హైదరి చెప్పినవన్నీ చేయలేకపోయినా, మంచి ఆహారం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే, అదితీరావు హైదరి చెప్పిన కొన్ని నియమాలనైనా పాటించగలిగితే, వృద్ధాప్యం త్వరగా దగ్గరకు రాదు. కొంతకాలం పాటు అందంగా యవ్వనంతో కనిపించే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications