ప్రోటీన్ లోపం ఉందని తెలుసుకోవటం ఎలా? లక్షణాలు ఏంటి?

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం సమతుల్య ఆహారమై ఉండాలి. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావలసిన ప్రోటీన్ సరైన మొత్తంలో ఉండాలి. ప్రోటీన్ లోపం ఉంటే మనం అనేక అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. మన శరీరంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ తదితరాలు లేకపోవడం వల్ల మన శరీరం వ్యాధులకు గురవుతుంది.

ప్రోటీన్ లోపంతో అనారోగ్యం
సహజంగా మనం తీసుకునే ఆహారం మన శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వాలి. కానీ మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారాలు శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వకపోగా ప్రోటీన్ లోపానికి కూడా కారణంగా మారుతాయి. ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపంతో బాధపడేవారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ప్రోటీన్ లోపంతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

How do you know if you have a protein deficiency What are the symptoms

ప్రోటీన్ లోపం ఉంటె కనిపించే అనారోగ్య లక్షణాలు
ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ భారిన పడతారు. కొంతమంది చర్మ సమస్యలతో పాటు జుట్టు రాలే సమస్యలు కూడా ఎదుర్కొంటారు. కొన్నిసార్లు శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పటికీ పెద్దగా లక్షణాలు కనిపించవు. ప్రోటీన్ లోపం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తగ్గడం మాత్రమే కాదు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా పని చేసిన వెంటనే అలసిపోతారు.

ప్రోటీన్ లోపంతో కండరాల బలహీనత
కడుపుబ్బరం, శరీరం శక్తిని కోల్పోవడం వంటి లక్షణాలు ప్రోటీన్ లోపంతోనే వస్తాయి. ఇక రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఏవైనా అనారోగ్యం కలిగితే త్వరగా కోలుకోరు.
ప్రోటీన్ లోపం వల్ల చాలామందిలో కండరాల బలహీనత వస్తుంది. కండరాల బలహీనతతో ఏ పని చేయలేరు. కండరాలు బలహీనంగా మారితే శరీర ఆకృతిని కూడా కోల్పోతారు. కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాలి.

ప్రోటీన్ లోపిస్తే ఈ సమస్యలు కూడా
శరీరంలో ప్రోటీన్లు లోపిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొందరికి ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుంది. జుట్టు నిర్జీవంగా మారి బాధ కలిగిస్తుంది. ఇక ఈ సమస్యతో బాధపడేవారు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇక మానసికంగా కూడా ప్రోటీన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్న వారిలో కొందరు బరువు తగ్గిపోతారు. బరువు తగ్గుతున్నప్పుడు ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవాలి. కొంతమందికి గోర్ల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి ప్రోటీన్ లోపం నివారించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+