షాంపూలో ఈ ఒక్కటి కలిపి వాడండి... జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
మహారాజులకు, యువరాజులకు, రాజ్యరికంలో ఉండేవారికి తలపై కిరీటాలు ఉంటాయి. కానీ సామాన్యులకు ఉండవుకదా. మహారాజుల నుంచి సామాన్యుల వరకు అందరికీ భగవంతుడిచ్చిన కిరీటం ఒకటి ఉంది. అదే జుట్టు. మనిషి తన శరీరంలో అన్నింటికన్నా బాగా ఇష్టపడేది జుట్టునే. ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ఒక్క వెంట్రుక రాలిపోయినా పది సంవత్సరాల ఆయుష్షు తగ్గిపోయినంత బాధపడతాడు. మహిళలైనా అంతే. తమ జుట్టు మృదువుగా ఉండటానికి, ఒత్తుగా ఉండటానికి, పొడవుగా ఉండటానికి అనేకరకాలను వినియోగిస్తుంటారుకానీ ఉపయోగం ఉండదు.
ఔషధాల గని తేనె
అలా కాకుండా తల స్నానం చేసేటప్పుడు షాంపూను అందరూ వాడుతుంటారు. ఇందులో ఈ ఒక్కటి కలిపి తల స్నానం చేస్తే జుట్టు రాలదు. అలాగే పొడుగ్గా పెరుగుతుంది. దీనికితోడు పోషకాహారం కూడా తీసుకుంటుండాలి. జుట్టు సంరక్షణను జాగ్రత్తగా చూసుకుంటుండాలి. షాంపూకు తేనె కలపాలి. వినడానికి, చదవడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ కలయిక జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. తేనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జట్టును కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. తలస్నానానికి మనం వాడే షాంపూలో అంతే పరిమాణంలో తేనె కలిపి తలకు పట్టించాలి. కొంచెంసేపు మసాజ్ చేసి తర్వాత నీటితో కడగాలి.

వారానికి రెండుసార్లు చేయాలి
ఇలా వారానికి రెండుసార్లు చేస్తుండటంవల్ల వెంట్రుకలు ఎంతో పొడవుగా పెరుగుతాయి. ఒకసారి వాడితే మీకే తేడా తెలుస్తుంది. తేనెలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్ల వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టును ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయి. జుల్లు రాలడం కూడా తగ్గిపోతుంది. దీనికోసం ఎంతోమంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారుకానీ షాంపూలో తేనె కలిపి వాడితే జుట్టు రాలదు. తేనెలో ఉండే కెరాటిన్ అనే ప్రొటీన్ జుట్టును బలంగా ఉంచుతుంది. కొంతమంది జుట్టు ఎండిపోయినట్లు, కళావిహీనంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిరకాలు వాడినా అది మారదు. ఆ సమస్య తగ్గి జుట్టు మృదువుగా, తళతళలాడుతుండాలంటే తేనెను వాడాలి. ఏవైనా అలర్జీలు ఉంటే దీన్ని వాడకండి. ఓసారి వైద్యుని సలహా తీసుకొని వాడమని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications