దగ్గుతో బాధపడేవారు ఈ ఆహారాలు తినొద్దు!
వాతావరణం మారినప్పుడల్లా సీజనల్ ఫీవర్స్, జలుబు, దగ్గు వంటివి సాధారణంగానే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు వస్తే ఒక పట్టాన వదిలిపెట్టదు. అయితే దగ్గుతో బాధపడేవారు ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. దగ్గు బాగా ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు తింటే దగ్గు మరింత పెరుగుతుంది. అది మీ ఊపిరితిత్తుల పైన, గొంతు పైన ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.
దగ్గుతో ఇవి తినకూడదు
అసలు దగ్గుతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటి? ఏ ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.దగ్గుతో బాధపడేవారు చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ఫ్రిజ్లో పెట్టిన నీళ్లు, బాగా చల్లగా ఉన్న జ్యూసులు, చల్లని లస్సీలు అసలు తాగకూడదు. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. ఇక ఐస్ క్రీమ్ ను అసలే తినకూడదు. దీనివల్ల గొంతులో మంట మరింత పెరుగుతుంది.

బాగా ఆయిల్ లో వేయించినవి తింటే ఎక్కువ దగ్గు
దగ్గుతో బాధపడుతున్న వారు ఎక్కువ ఆయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. బజ్జీలు, పకోడీలు, బోండాలు, చిప్స్ వంటివి తింటే దగ్గు మరింత ఎక్కువవుతుంది. జీర్ణక్రియ మందగింపు కూడా దగ్గు పెరగడానికి కారణమవుతుంది. ఇక దగ్గుతో బాధపడేవారు డ్రైఫ్రూట్స్ కూడా తినకూడదు. పల్లీలు, బాదం పప్పు వంటివి తినకుండా ఉంటేనే మంచిది. డ్రై ఫ్రూట్స్ గొంతులో రాపిడిని గొంతుకు మరింత ఇబ్బందిని కలుగజేస్తాయి.
వీటికి దూరంగా ఉంటేనే దగ్గు నుండి రిలీఫ్
దగ్గుతో బాధపడేవారు స్వీట్లు, చాక్లెట్లు తినకుండా ఉండాలి. వీటి వల్ల కఫం పెరుగుతుంది కాబట్టి ఇవి తినకుండా ఉంటేనే మంచిది. దగ్గుతో బాధపడేవారు ముఖ్యంగా పాలు, పాల పదార్థాలకు కూడా దూరంగా ఉంటే మంచిది. పెరుగును దగ్గు తగ్గేవరకు తీసుకోకుండా ఉండాలి. ఒక వేళ ఇవి తింటే సమస్యను మరింత పెంచి దారుణంగా మారుస్తుంది.
పొడి దగ్గు ఉంటే ఇవి అసలే తినొద్దు
ముఖ్యంగా పొడి దగ్గుతో బాధపడేవారు గొంతు పొడిబారి పోయే ఆహారాలను తగ్గించుకుంటే మంచిది. ఆహారం విషయంలో నియమాలని పాటించటంతో పాటు, చిన్న చిన్న నేచురల్ రెమెడీస్ కూడా చేస్తూ ఉండాలి. వారం రోజుల తర్వాత కూడా దగ్గు తగ్గకపోతే సమీపంలో ఉన్న వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.












Click it and Unblock the Notifications