International yoga day 2024: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం... ఈ ఏడాది థీమ్ ఏంటంటే!!

జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే జూన్ 21వ తేదీన శ్రీనగర్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు
యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెబుతున్నారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనీ యోగా గురువులు చెబుతున్నారు.

International yoga day 2024 Complete health with yoga this year theme is

2024 యోగా డే థీమ్ ఇదే
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడంలో భాగంగా ఒక నిర్దిష్టమైన థీమ్ ని తీసుకుంటారు. 2024 సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న థీమ్ ను తీసుకున్నారు. అంటే యోగ మన కోసం మరియు మన సొసైటీ కోసం అన్న థీమ్ తో ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నారు.

యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని మోడీ
ఈ శతాబ్దంలో యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, మనం గ్రహించామని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా యోగాను ప్రతీ ఒక్కరూ సాధన చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చునని చెప్పారు.

మోడీ కృషి ఫలితమే అంతర్జాతీయ యోగా దినోత్సవం
భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్విరామ కృషి కారణంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇక అప్పటినుంచి మన దేశంలో యోగాకు చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చి పెద్దఎత్తున దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్య విప్లవం యొక్క యుగాన్ని యోగా ప్రేరేపిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకాలస్యం శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగ సాధన అస్సలు మరచిపోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+