కార్తీకమాసం స్పెషల్.. 'చలిమిడి'.. ఈ టిప్స్ పాటిస్తే వెన్నలా కరిగిపోతుంది..!
కార్తీకమాసంలో అనేకమంది నిత్యం పూజలు చేస్తుంటారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. నెల రోజులపాటు భక్తి శ్రద్ధలతో శివున్ని పూజిస్తారు. వివిధ రకాల నైవేద్యాలు తయారు చేసి నివేదన చేస్తుంటారు. అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం చలిమిడి. ఈజీగా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ ఆహారాన్ని ఇష్టంగా తింటారు. మరి చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలి..?
ముందుగా చలిమిడి తయారు చేసుకోవడానికి తీసుకోవాల్సిన పదార్థాలు చూస్తే.. బియ్యం పిండి రెండు గ్లాసులు, బెల్లం తురుము ఒక అర కప్పు, జీడిపప్పులు కొన్ని రుచికి సరిపడా, యాలకుల పొడి అర టీ స్పూన్, నెయ్యి మూడు స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు తీసుకోవాలి.
ఇక చలిమిడి ప్రసాదం తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యం పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే కొందరు తడి బియ్యంతో చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. దాదాపు ఆరు గంటలపాటు నానబెడితే బెటర్. ఆ తర్వాత బియ్యాన్ని వడకట్టి.. కొద్దిసేపు ఆరబెట్టి గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ బియ్యంపిండిని కూడా తీసుకోవచ్చు. ఇక బెల్లం పాకం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి దాంట్లో బెల్లం తురుము వేయాలి. బెల్లం మునిగేవరకూ నీళ్లు పోయాలి. చిన్న మంట మీద ఉంచితే పాకం వస్తుంది. అందులో యాలకుల పొడిని, కొబ్బరి ముక్కలను, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. అందులోనే బియ్యం పిండిని బెల్లంపాకంలో మెల్లగా వేస్తూ గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా ఆపకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. చలిమిడి గట్టిగా అయ్యే వరకూ తిప్పుతూ ఉండాలి. చివరిలో రెండు స్పూన్ ల నెయ్యి వేసి కలిపేసి దింపాలి. ఇక చలిమిడి రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications