చిరుధాన్యాలు కాదు ఆరోగ్యాన్నిచ్చే సిరిధాన్యాలు.. వదిలిపెట్టకండి
మన ఆరోగ్యం ఎవరి చేతులలోనూ ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలోనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత సంపద ఉన్న ఆరోగ్యంగా లేకుంటే ఏం చేసినా, ఎంత సంపాదించినా వేస్ట్. ఆరోగ్యం లేకుంటే జీవితమే వృధా అవుతుంది.
చిరు ధాన్యాలపై ప్రజలలో పెరిగిన అవగాహన
మరి మనకు ఆహారం అనగానే పండ్లు ,కూరగాయలు,ఆకు కూరలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న ఆహారం చిరు ధాన్యాలు. ఇటీవల కాలంలో జనాలకు వీటిపైన చాలా అవగాహన పెరిగింది. చాలా చోట్ల చిరుదాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు లభిస్తున్నాయి. చిరు ధాన్యాల టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఇక చిరు ధాన్యాలతో పిండి వంటలు కూడా తయారు చేస్తున్నారు.

చిరు ధాన్యాలలో వేటికవే స్పెషల్
ఇక ఎలాంటి చిరు ధాన్యాలతో మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం. చిరు ధాన్యాలలో కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, అండ్రు కొర్రలు ఇలా చాలానే ఉన్నాయి. ఈ చిరు దాన్యాలన్నీ వేటికవే స్పెషల్. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని భావించే వారు వీటిని ఒక టైం టేబుల్ ప్రకారం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
చిరు ధాన్యాలలో మన శరీరానికి కావలసిన బోలెడు మిటమిన్లు, పోషకాలు ఉంటాయి. చిరు ధాన్యాలు ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వటంతో పాటు మన శరీర బరువును తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఆరోగ్యానిచ్చే వాటిలో రాగులు ఒకటి . ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అనీమియాను నివారిస్తాయి.
రాగులు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం
రాగులను నానబెట్టి మొలకలు వచ్చాకా తినవచ్చు ఇలా తినడం వలన శరీరానికి మెరుగైన పోషకాలు అందుతాయి. ఆహారంలో రాగులను వివిధ రూపాల్లో చేర్చుకోవచ్చు . రాగులను పిండిగా చేసుకుని రాగి జావ చేసుకోవచ్చు రాగిజావ మంచి పౌష్టికాహారం. రాగి పిండితో దోశ,ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. రాగి సంకటి చేసుకుని తిన్నా మంచిదే.
గుండె సమస్యరాకుండా చేసే జొన్నలు
ఇక చిరుదాన్యాలలో మరొక ముఖ్యమైన సిరి ధాన్యం జొన్నలు, ఈ చిరు ధాన్యాలు తినడం వలన హార్ట్ ను హెల్డీగా ఉంచుతాయి. మన శరీరంలో గుండె ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలా మందిని హార్ట్ సమస్య వెంటాడుతుంది. ఇక హార్ట్ సమస్యను అరికట్టడానికి తృణ ధాన్యాలలో మేలైనవి జొన్నలు. శరీరంలో ఇమ్యూనిటీ నీ పెంచుతుంది. శరీరంలో అనేక మంచి మార్పులను తెస్తుంది.
బరువు తగ్గించటంలో జొన్నల పాత్ర
జొన్నలు అధిక బరువును నియంత్రిస్తాయి. బరువు తగ్గించటంలో జొన్నల పాత్ర చాలా కీలకం. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. షుగర్ లెవల్ ను పెరగకుండా అరికడుతుంది. జొన్నలని నానబెట్టి మొలకలుగా తినవచ్చు,లేదా జొన్నలను పిండిగా చేసి జొన్నరొట్టెల రూపంలో ఆహారంగా తినవచ్చు. జొన్న ఇడ్లీ, జొన్న దోశ వంటివి కూడా చేసుకుని తినవచ్చు. ఈ జొన్నలలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. రక్తం పెరగటానికి తోడ్పడే ఇనుము ,క్యాల్షియం బి మిటమిన్లు ఉంటాయి.
ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాలలో సజ్జలు స్పెషల్
ఫైబర్, మెగ్నీషియం పొటాషియం, జింక్ వంటి పోషకాలు సజ్జలలో పుష్కలంగా ఉంటాయి. అన్ని చిరు ధాన్యాలలో కెల్ల అధిక పోషకాలు సజ్జలలో ఉంటాయి..వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే మల బద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది గుండె జబ్బుల ప్రమాదం రాకుండా సజ్జలు కాపాడుతాయి.
డయాబెటిస్ ఉన్న వారికి సజ్జలు సూపర్ ఫుడ్
రక్త ప్రసరణలో గ్లూకోజ్ ను నిదానంగా విడుదల అయ్యేలా చేస్తాయి సజ్జలు. రక్తపు చక్కర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా సజ్జలు అరికడతాయి. ఇవి మధుమేహం వున్న వారికి లేదా మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం. సజ్జలు మధుమేహం బారిన పడకుండా కాపాడతాయి. సజ్జలను ఆన్నంగా, సజ్జల జావగా, ఇడ్లీ, దోశ వంటివి చేసుకుని కూడా తీసుకోవచ్చు.
ముఖ్యమైన సిరి ధాన్యం కొర్రలు
ఇక చిరుధాన్యాలలో మరో ముఖ్యమైన ఆహారంగా కొర్రలు చెప్పవచ్చు. కొర్రలలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు సమపాళ్ళలో ఉండి ఆహారంలో భాగంగా తీసుకున్న వారికి మేలు చేస్తాయి. కొర్రలతో తినేవారికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహం,ఊబకాయం లాంటివి అస్సలు దరిచేరవు.
ఊబకాయం, డయాబెటిస్ కు కొర్రలతో చెక్
బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. కోలన్ క్యాన్సర్ తో పాటు చాలా రకాల క్యాన్సర్ లను రాకుండా అరికడుతుంది .రక్తంలో చక్కెర స్థాయిలను అరికడుతుంది .ఈ కొర్రలను ఏ వయస్సు వారు అయినా తినవచ్చు. కొర్రలు రక్త హీనతను తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గించటానికి దోహదం చేస్తాయి.
అండ్రు కొర్రలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మనం చెప్పుకోవలసిన మరొక ముఖ్యమైన సిరి ధాన్యం అండ్రు కొర్రలు. ఈ అండ్రు కొర్రలను బ్రౌన్ టాప్ మిల్లెట్ అని చెబుతారు. అండ్రు కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకుంటే కఫ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తుంది. పైల్స్, ఫిస్టులా, హెమరాయిడ్స్, అల్సర్స్ తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టే అండ్రు కొర్రలు
అండ్రు కొర్రలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. మతిమరుపు రాకుండా సహాయం చేస్తాయి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.రక్త హీనతను తగ్గించటంలో కీలక భూమిక పోషిస్తాయి. అలాగే జ్వరం, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
చుక్కకూర మటన్ కర్రీ సూపర్ టేస్ట్.. ఇలా చేస్తే అన్నం మెతుకు కూడా వదిలిపెట్టరు -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
"బ్రకోలి కర్రీ" ఎప్పుడైనా ట్రై చేశారా..? -
బడ్జెట్లో స్మూతీ మేకర్స్ కావాలా.. బెస్ట్ డీల్స్ ఇవే ?? -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications