శృంగార మామిడి పండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు

మామిడిపండు... వేసవిలో మాత్రమే దొరికే సీజనల్ పండు. ఇక మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. పండ్లలో రారాజుగా మామిడిపండును చెబుతారు. అటువంటి మామిడిపండును తినడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే అతిగా తినటం మాత్రం మంచిది కాదు. ఏ పండు తిన్నా తగిన మొతాడులోనే తినటం మంచిది.

మామిడితో అందం.. చర్మం నిగారింపు
మామిడిపండు అందరికీ నచ్చేలా రుచి ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ యాక్నే సమస్యలను, ఇతర చర్మ సమస్యలను తొలగిస్తాయి. మామిడి పండును తినడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. దీనివల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.మామిడి పండ్లను తింటే చర్మంపై ముడతలు తొలగిపోతాయి.

mango gives health benefits and increases Sexual ability in men

మామిడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి పండ్లలో బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆస్తమా నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది. మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తాయి. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. మామిడి పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు మామిడి పండ్లను తినడం మంచిది.

శృంగార సామర్ధ్యానికి మామిడి పండు
మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గుతుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను రాకుండా చేస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. మామిడి పండును తింటే పురుషులలో శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. మామిడి పండ్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

శరీరానికి మామిడి పోషణ
మామిడి పండులో ఉండే పోషకాలు శరీరానికి మంచి పోషణనిస్తాయి. తల వెంట్రుకల కుదుళ్లను మామిడిలో ఉండే పోషకాలు కాపాడతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. . మామిడిలోని పీచు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా చేస్తుంది. ఇలా మామిడి పండుతో శృంగార ఉద్దీపనకు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+