యువతను వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పి.. ఈ చిన్న చిట్కాలతో చెక్ పెట్టండి..?
ప్రస్తుతం యువతను వేధిస్తున్న సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. ఒత్తిడి లైఫ్, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్క్రీన్ టైమ్ పెరగడం, నిద్రలేమి.. తదితర కారణాల వల్ల యువతలో మైగ్రేన్ ఒకటి. నార్మల్ గా వచ్చే తలనొప్పి తొందరగానే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ వచ్చిందంటే మాత్రం.. గంటల నుంచి రోజుల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మైగ్రేన్ నొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఒత్తిడి, డీ- హైడ్రేషన్, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాలు మైగ్రేన్ కు దారితీయవచ్చు. ఇంతకీ, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మైగ్రేన్ సమస్య నుంచి ఎలా బయటపడాలి..
ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విరామం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్ నుంచి దూరంగా వెళ్లండి. కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఇతర వస్తువులను చూడండి. ఇలా చేయడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అలాగే రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ కెఫిన్ కలిగిన కాఫీ, టీ లాంటివి తాగాలని చెబుతున్నారు. ఒత్తిడి హార్మోన్లను అధిగమించడానికి శ్వాస వ్యాయామాలు, యోగా సాధన వంటివి చేయాలని సూచిస్తున్నారు.

మరోవైపు మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ.. ప్రాసెసింగ్ ఫుడ్స్, ప్యాకేజింగ్ ఫుడ్స్, అధిక చక్కెర, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. దాంతోపాటు రోజువారి వంటలలో వాడే నూనెల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా లినోలెయిక్ యాసిడ్ అనే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తక్కువగా ఉండే నూనెలు వాడేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించండి.












Click it and Unblock the Notifications