భరించలేని నోటి దుర్వాసన.. కారణాలివే.. తగ్గించుకోండిలా!
నోటి దుర్వాసన ఇది చాలా చిరాకు కలిగించే సమస్య. ఇది చాలా చిన్న సమస్య అనిపించినా, ఇది సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఇబ్బందికరంగా అనిపించే సమస్య. నోటి దుర్వాసన దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవటం కారణంగా వస్తుంది. దంతాలను సరిగా శుభ్రం చేయకపోవటం కారణంగా నోట్లో చెడు బ్యాక్టీరియా తయారవుతుంది. అది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ఇక చిగుళ్ళ సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కూడా కారణం అవుతుంది.
నోటి దుర్వాసన వీటి వల్లే
తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కాహాల్ వంటివి కూడా నోటి దుర్వాసనకు కారణంగా చెప్పవచ్చు. నోట్లో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కూడా నోరు దుర్వాసన వస్తుంది, అంతేకాదు కొన్ని రకాల అనారోగ్య కారణాలు కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నా నోటి దుర్వాసన
డయాబెటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యలు, లేదా కొన్ని మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. పొగతాగడం కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ఇక నోటి దుర్వాసనను తగ్గించటానికి ప్రతీ ఒక్కరూ రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవాలి. నాలుకను క్లీన్ చేసుకోవాలి. తగినంత నీటిని తాగాలి.
నోరు దుర్వాసన రావొద్దు అంటే ఇవి తినొద్దు
నోరు ఆరోగ్యం కోసం చెక్కెర ఆహారాలను ఎక్కువ తీసుకోకండి. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలను తీసుకుంటే నోరు దుర్వాసన వస్తుంది కనుక జాగ్రత్త. నోరు పొడిబారకుండా నీరు తాగండి. లాలాజల ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నోటి ఆరోగ్యం కోసం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించాలి.
నోటి దుర్వాసన రాకుండా వైద్యులను సంప్రదించండి
దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకోవాలి. జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు అనుమానం ఉంటే కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వైద్యులను సంప్రదించటం మంచిది.
గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన వివరాలు ఆరోగ్య నిపుణుల సూచనలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం అందించబడ్డాయి. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
-
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications