సెలబ్రేషన్స్ కోసం బెస్ట్ ఛాయిస్.. "మటన్ బోటి ఫ్రై" ట్రై చేస్తారా.. !
వేడుకలు, కార్యక్రమాల్లో మాంసాహార వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు.. ఇలా ఎన్నో రకాలు ఉన్నా కూడా "మటన్ బోటి"కి మాత్రం సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. బోటిని శుభ్రం చేయడం కాస్త కష్టమైన పని అయినా.. సరిగ్గా వండితే మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే అనడంలో సందేహం అక్కర్లేదు. దీని తయారీకి సమయం పట్టినప్పటికీ, లభించే అద్భుతమైన రుచి పడిన శ్రమనంతా మర్చిపోయేలా చేస్తుంది.
సాధారణంగా బోటీ ఫ్రైని రొట్టె, గారెలు లేదా వేడి అన్నంతో ఆస్వాదిస్తారు. మేక లేదా గొర్రె పేగులతో చేసే ఈ బోటీ ఫ్రైని సరిగ్గా శుభ్రపరిచి, సరిగ్గా వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే బోటి సరిగ్గా క్లీన్ అవ్వకపోయినా, పర్ఫెక్ట్గా ఫ్రై చేయకపోయినా నీచు వాసన వస్తుంది. అయితే ఇకపై ఆ సమస్య లేకుండా ఉండేలా బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలి? నాటు స్టైల్ బోటీ ఫ్రైని ఇంట్లోనే తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాల వివరాలు సహా తయారు చేసే విధానం మీకోసం ప్రత్యేకంగా..

బోటీ క్లీన్ చేసే విధానం..
ఒక బౌల్లో బోటీ తీసుకొని అందులో ఉప్పు, జొన్న పిండి, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి.
సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు వీటిని కలుపుకున్న తర్వాత వాటర్‌తో వాష్ చేసి మరో గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ తర్వాత క్లీన్ చేసుకున్న బోటీలో కొద్దిగా పసుపు, బోటీ మునిగేంతవరకు వాటర్ పోసి కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి నీటిని వడకట్టాలి. కావాలనుకుంటే బొంతపై ఉండే పొట్టు తీసుకోవచ్చు.
ఇలా పొట్టు తీసిన తర్వాత మరోసారి నార్మల్ వాటర్‌తో కడిగి కావాల్సిన సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకుంటే బోటీ రెడీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
మటన్ బోటీ
నూనె
జీలకర్ర
పచ్చిమిర్చి
ఉల్లిపాయలు
టమాటో
పసుపు
అల్లంవెల్లుల్లి పేస్ట్
ధనియాల పొడి
కరివేపాకు
జీరా పొడి
ఉప్పు
కారం
తయారీ విధానం..
బోటీని శుభ్రంగా కడిగి, ఉడికించిన తర్వాత.. మరోవైపు నాలుగు మధ్యస్థాయి ఉల్లిపాయలను, ఒక టమాటోను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా తరగాలి.
ఇప్పుడు స్టవ్‌పై కుక్కర్ పెట్టి, ఉడికించిన బోటీని మునిగేంత నీళ్లు పోసి, 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టండి. తర్వాత ఇనుప కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని పెద్ద మంటపై వేయించి, అవి మెత్తబడ్డాక టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ చేర్చి, పచ్చివాసన పోగానే రెండు రెమ్మల కరివేపాకు కలపాలి.
ఉడికించిన బోటీని ఈ మిశ్రమంలో కలిపి, మూతపెట్టి పెద్ద మంటపై మూడు నిమిషాలు మగ్గించాలి.
తర్వాత మూత తీసి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీస్పూన్ జీరా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు మంట తగ్గించి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి, మళ్లీ మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపివేయాలి.
మీకు వేడి వేడి బోటీ ఫ్రై రెడీగా ఉంటుంది.
కావాలంటే నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications