పెసరపప్పు టమాటా.. ఇలా వండితే ఎంత రుచిగా ఉంటుందో!
మనం తీసుకునే ఆహారం ఎప్పుడు పోషకాలతో నిండి ఉండాలి. తీసుకునే ఆహారంలో మనం తినే కూర చాలా ముఖ్యమైంది. ఈరోజు మనం మంచి పోషకాలతో నిండిన సూపర్ టేస్టీ కూర గురించి తెలుసుకుందాం. అటువంటి కూరలలో పెసరపప్పు టమాటా కూర చాలా ముఖ్యమైంది. ఇది మంచి విటమిన్స్, ఖనిజాలతో పాటు శరీరానికి కావాల్సిన అనేక పోషకాలతో మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
పెసరపప్పు టమాటా కూర తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు- 150 గ్రాములు
టమాటాలు- 4
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిరపకాయలు- నాలుగు
కరివేపాకు- రెండు రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్
పసుపు -అర స్పూన్
ఉప్పు- ఒకటిన్నర స్పూన్లు
కారం - ఒకటిన్నర స్పూన్లు
ధనియాల పొడి- ఒక స్పూన్
నూనె- మూడు స్పూన్లు
కొత్తిమీర- కొద్దిగా
పోపు గింజలు - ఒక స్పూన్
ఎండు మిరపకాయలు - 2

తయారీ విధానం
పెసరపప్పు టమాటా కూర తయారు చేయడానికి ముందుగా అరగంట ముందు పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఆపై స్టవ్ మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు, ఎండు మిరపకాయలు వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఆపై ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత. నానబెట్టిన పెసరపప్పును అందులో వేయాలి.
ఇలా వండితే సూపర్ టేస్ట్
పెసరపప్పు కూడా కాస్త మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై అందులో అర స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం వేసి పెసరపప్పు ఉడకడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి.
పెసరపప్పు, టమాటా అన్నం లోకే కాదు, చపాతీ, పూరీ ఏదైనా సూపర్
పెసరపప్పు మరీ మెత్తగా ఉడికితే పప్పు టేస్ట్ రాదు. పెసరపప్పు సగానికంటే ఎక్కువ ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి వేసుకుని కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఆపై కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పెసరపప్పు టమాటా కూర అన్నంలో కే కాదు చపాతీ లోకి, పూరి లోకి టుడే సూపర్ గా ఉంటుంది. తక్కువ కేలరీలతో ఆరోగ్యకరమైన వంటగా దీనిని చెప్పవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications