ఇదేం పిచ్చి ట్రెండ్!: డేటింగ్ కోసం స్నానం బంద్, మూత్రం తాగడం ఏందయ్యో!

Pheromone Maxxing: సోషల్ మీడియాలో వింత వింత ట్రెండ్లు రావడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'ఫెరోమోన్ మ్యాక్సింగ్" అనే కొత్త ట్రెండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డేటింగ్‌లో అమ్మాయిలను ఆకర్షించేందుకు యువకులు స్నానం చేయడం మానేయడం, డియోడరెంట్లు వాడకపోవడం, ఉతకని చెమట దుస్తులను మళ్లీ ధరించడం వంటివి ఈ ట్రెండ్‌లో భాగమయ్యాయి.

పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్
పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్

'ఫెరోమోన్ మ్యాక్సింగ్" నేపథ్యం
యువత తమ రూపురేఖలను, ఆకర్షణను పెంచుకోవడానికి చేసే 'మ్యాక్సింగ్' సంస్కృతి నుంచే ఈ పదం పుట్టుకొచ్చింది. మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే సువాసనల్లో 'ఫెరోమోన్లు' అనే రసాయనాలు ఉంటాయని, ఇవి ఎదుటివారిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ ట్రెండ్ ప్రచారం చేస్తోంది. సబ్బులు, పర్ఫ్యూమ్స్ వాడటం వల్ల ఈ సహజ గంధం దెబ్బతింటుందని భావించి.. కొందరు యువకులు రోజుల తరబడి స్నానం చేయడం మానేస్తున్నారు. కొందరైతే మూత్రం తాగడం వంటి తీవ్రమైన, హానికరమైన పద్ధతులను కూడా ప్రచారం చేస్తున్నారు.

Pheromone Maxxing Trend Why Young Men Are Skipping Showers and Drinking Urine for Dating

ఈ ట్రెండ్ ఎలా మొదలైందంటే?
సోషల్ మీడియా క్రియేటర్లు 'నాచురల్ మస్క్' పేరిట చేసిన వీడియోలు వైరల్ కావడంతో ఈ ట్రెండ్ మొదలైంది. స్నానం చేయకపోవడం వల్ల శరీరంలో ఆరా, ఆకర్షణ పెరుగుతాయని భావించే కొన్ని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. మొదట్లో ఇది సరదాగా లేదా మీమ్స్ రూపంలో మొదలైనప్పటికీ.. కొంతమంది యువకులు దీనిని తీవ్రంగా పరిగణించి పాటించడం మొదలుపెట్టారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు?

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?
ఈ విపరీతమైన భావనకు సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంతువుల్లో ఫెరోమోన్లు ఆకర్షణకు తోడ్పడతాయనేది వాస్తవమే అయినప్పటికీ.. మానవులలో లైంగిక ఆకర్షణను ప్రేరేపించే నిర్ధిష్ట ఫెరోమోన్ ఉందనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. స్నానం చేయకపోవడం వల్ల శరీరంపై బాక్టీరియా చేరి దుర్గంధం వస్తుంది తప్ప అది లైంగిక ఆకర్షణము పెంచదు. స్నానం మానడం వల్ల చర్మ సమస్యలు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

సహజమైన వాసనకు, వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడానికి చాలా తేడా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి వింత ట్రెండ్లను పాటించడం కంటే.. కనీస వ్యక్తిగత పరిశుభ్రత, మంచి వ్యక్తిత్వం, సంభాషణా నైపుణ్యాలు పాటించడమే డేటింగ్ లో నిజమైన ఆకర్షణను తెచ్చిపెడతాయని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+