మందుబాబులకు మాంచి కిక్కిచ్చే న్యూస్
వైన్ ను అందరూ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు తియ్య తియ్యగా ఉండటంతో ఎక్కువమంది తాగేస్తుంటారు. వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజాగా ఒక పరిశోధనలో తేలింది. ప్రతిరోజు ఒక పెగ్ వైన్ తాగడంవల్ల శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది. శరీరంలోని మలినాలను ఇది బయటకు పంపిస్తుంది.
రెడ్ వైన్‌లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది వివిధ రకాల అలెర్జీ, క్యాన్సర్, వైరల్ వ్యాధులను నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని రెడ్ వైన్ తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పళ్లపై ఉండే ఎనామిల్ ను వైన్ దృఢంగా చేయడంతోపాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

హాయిగా నిద్ర పోవడానికి ఒక పెగ్ రెడ్ వైన్ సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది. గుండె ధమనుల్లో ఉండే కొవ్వు నిల్వలను నిరోధించే రెస్వెరాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంటన్లను కలిగివుండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. ప్రతిరోజు చాలా తక్కువ మొత్తంలో తాగడం జలుబు పూర్తిగా తగ్గుతుంది.
శ్వాసకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మంపై ఉండే ముడతలను తగ్గించి ఎల్లప్పుడూ మనిషి యవ్వనంగా కనిపించేలా రెడ్ వైన్ చేయగలదు. రెడ్ వైన్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. హెలికోబాక్టర్ పైలోరీ నుంచి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.












Click it and Unblock the Notifications