విపరీతమైన తలనొప్పి, ఒళ్ళునొప్పులు, కంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఫైబ్రోమయాల్జియా కావచ్చు.. జాగ్రత్త!

ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కంటి చూపు మందగించడం, వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే మూడు నెలల కంటే ఎక్కువగా ఇలా తలనొప్పి ఒళ్లు నొప్పులు కంటిచూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడితే వారు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది ఫైబ్రోమాయాల్జియా కావచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

తీవ్రంగా వేధించే ఫైబ్రోమయాల్జియా
ఈ ఫైబ్రోమయాల్జియా సమస్య చాలా తీవ్రంగా బాధిస్తుంది. ఈ సమస్యలో మొత్తం శరీరం శరీరంలోని కండరాలు నరాల వ్యవస్థ అంతటా నొప్పి వ్యాపిస్తుంది. ఇవి మాత్రమే కాదు ఎముకలు కూడా ప్రభావితమవుతాయి ఎముకలు ,మృదులాస్థి, టెండాన్లు ఇలా శరీరమంతటా ఉన్న ఎముకలు, నరాలు, కండరాలలో తీవ్రమైన నొప్పి బాధిస్తుంది.

severe headache body pains vision changes may be fibromyalgia alert

ఫైబ్రోమయాల్జియా రావటానికి అనేక కారణాలు
అసలు ఈ ఫైబ్రో మయాల్జియా సమస్య ఎందుకు వస్తుంది అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ సమస్య జన్యు సంబంధంగా రావచ్చు. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా రావచ్చు. శారీరకంగా గాయాలకు గురైన తర్వాత వచ్చే అవకాశం లేకపోలేదు. దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడికి లోనైన వారికి వచ్చే అవకాశం ఉంది. అయితే పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

ఫైబ్రోమయాల్జియాకు శాశ్వత పరిష్కారం లేదు
ఈ సమస్య వచ్చినప్పుడు విపరీతమైన తలనొప్పి, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఆస్టియో ఆర్థరైటి,స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ ఉన్నవారిలో కూడా ఫైబ్రోమయాల్జియా వచ్చే అవకాశం ఉంది.ఫైబ్రోమయాల్జియాకు శాశ్వత పరిష్కారం లేదు. ఇది మళ్లీ రాకుండా తిరిగి నియంత్రించే అవకాశం లేదు. కేవలం లక్షణాలను నియంత్రించటానికి మందులు ఉన్నాయి.

మూడు నెలలు నొప్పులుంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు
దీని నుండి ఉపశమనం పొందడానికి మెడిటేషన్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. మూడు నెలలకు పైగా శారీరక నొప్పులు, విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటే, కంటి చూపులో మార్పు చోటు చేసుకుంటే ఫైబ్రోమయాల్జియాగా అనుమానించి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం అవసరం. లేదంటే అది తీవ్రతరమైతే మీ రోజువారీ జీవితం కూడా ప్రభావితం అవుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+