గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్నారా? వెన్నెముక సమస్యలు, జాగ్రత్త
ఐటీ నిపుణులు, కంప్యూటర్ల ముందు ఎక్కువ గంటలు పనిచేసేవారు ఎక్కువశాతం వెన్నెముక సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం వీరు ఎక్కువ గంటలు కదలక మెదలక కంప్యూటర్ల ముందు కూర్చోవడం. ఈ ధోరణి ప్రత్యేకంగా టెక్ పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉద్యోగులు తరచుగా వారి డెస్క్‌ల వద్ద ఎక్కువ కాలం ఉండడం వల్ల తరచూ వారికి వెన్నునొప్పి, వెన్నెముక సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
వెన్నెముక సమస్యలతో ఉత్పాదకతపై ప్రభావం
సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.చాలామంది కంప్యూటర్ల ముందు లాప్టాప్ ల ముందు కూర్చుని పని ఎక్కువ గంటలు వాటి ముందు కూర్చోవడం వల్ల వారికి తెలియకుండానే తప్పుడు భంగిమలో కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల వెన్నెముక పొజిషన్ తప్పుగా ప్రభావితమై ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వెన్నెముక సమస్యలు శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతాయి. వెన్నెముక సమస్యలు ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తాయి.

కంప్యూటర్లపై పని చేసేవారిలో వెన్నెముక సమస్యలు
వెన్నెముక సమస్యలు ఉద్యోగుల ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తాయి. వారి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. వారి ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వెన్నెముక సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఐటీ పరిశ్రమలోనూ, కంప్యూటర్ల ముందు పని చేసే వారు ఎవరైనా సరే క్రమమైన విరామాలు తీసుకోవలసిన అవసరం ఉంది. అంతేకాదు కచ్చితంగా వ్యాయామాన్ని చేయాలి.
ఉద్యోగుల ఆరోగ్యం కోసం కంపెనీల వెల్ నెస్ ప్రోగ్రామ్స్
వారు పని చేయడానికి కావలసిన వర్క్ స్టేషన్లను సరైన విధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా వారిని ఈ సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఎక్సర్సైజ్, యోగా వంటివి వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడడానికి దోహదం చేస్తాయి. కొన్ని కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం చర్యలు కూడా తీసుకుంటున్నాయి. వారు ఎర్గోనామిక్ ఫర్నిచర్ ను అందిస్తున్నారు.
లాంగ్ సిట్టింగ్ అవర్స్ మంచిది కాదు... డేంజర్
అంతేకాదు పనిచేసే సమయంలో కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నారు. వెల్నెస్ ప్రోగ్రాం లను ఎక్కువగా నిర్వహిస్తూ వెన్నెముక సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. వెన్నెముక సమస్యలు రాకుండా పని స్థలంలో తీసుకోవలసిన ఆచరణల పైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ద్వారా మంచి ఉత్పాదకతను సాధించడంతో పాటు పనిచేసే వారి ఆరోగ్య రక్షణకు కూడా మేనేజ్మెంట్ లు దోహదం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications