రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే సూపర్ సింపుల్ టిప్స్.. ప్లీజ్ ఫాలో!

డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బారినపడి ఇబ్బంది పడుతున్న వారు లెక్కకు మిక్కిలి ఉన్నారు. డయాబెటిస్ ని నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరంలోని ప్రధాన అవయవాల పైన పడుతుందని చెబుతారు. శరీరంలోని మూత్రపిండాలు, కళ్ళు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు డయాబెటిస్ కారణంగా దెబ్బతింటాయని ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే మన డయాబెటిస్ ఎప్పుడు కంట్రోల్ లోనే ఉండాలని చెబుతారు.

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే రెమిడీస్
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంచుకుంటే మనం డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకున్నట్టేనని చెబుతున్నారు. అయితే డయాబెటిస్ ను, రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి బోలెడన్ని నేచురల్ రెమిడీస్ కూడా ఉన్నాయని చెబుతున్నారు మరి వాటి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Super simple tips to reduce blood sugar levels Please follow these tips to control diabetes

షుగర్ ఎక్కువగా ఉంటే ఇవి తినండి
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో కివి, అవకాడో, జామపండు, బొప్పాయి వంటి పండ్లను చేర్చుకోవాలి. వీటివల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. శరీరంలోని రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నప్పుడు ఆహారంలో గ్రీన్ వెజిటేబుల్స్ ను, సలాడ్స్ ను ఎక్కువగా చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది.

ఆహారం, వ్యాయామం రెండిటిపై శ్రద్ధ అవసరం
అంతే కాదు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలనుకునేవారు ఆహారంలో చేదుగా ఉన్న పదార్థాలను భాగంగా చేసుకోవాలని ముఖ్యంగా కాకరకాయ, మెంతులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా బాదంపప్పు, వాల్ నట్ లను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆహారం మాత్రమే కాకుండా శారీరక శ్రమ పైన కూడా శ్రద్ధ పెట్టాలని ప్రతిరోజు 45 నిమిషాల పాటు కచ్చితంగా నడవాలని సూచిస్తున్నారు.

ఇలా చేస్తే డయాబెటిస్ కు చెక్
శారీరక వ్యాయామం లేకపోతే కూడా బ్లడ్ షుగర్ విపరీతంగా పెరుగుతుందని, శారీరక వ్యాయామంతో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే అది మనకు అన్ని విధాలుగా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి ఆహారాలు తింటే మంచిదో తెలుసుకొని అలాంటి వాటినే తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+