నోరూరించే 'తోటకూర చికెన్'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్..!
చికెన్ కర్రీని ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. కర్రీ అయినా ఫ్రై అయినా రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పటికే చికెన్ ను రకరకాలుగా చేసుకుని ఉంటారు. మరి వెరైటీ స్టైల్ లో తోటకూర చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా..? ఆకుకూర కాంబోలో ఈ కర్రీ భలే కమ్మగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.. మరి తోటకూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..
తోటకూర చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ అరకేజీ, తోటకూర ఐదు లేదా ఆరు కట్టలు, నూనె తగినంత, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, ఉల్లిపాయలు రెండు, టమాటోలు రెండు, పసుపు చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాలపొడి, గరంమసాలా, పెరుగు కొద్దిగా, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
తయారీ విధానం చూస్తే.. ముందుగా తోటకూరను తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ ను శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి.

ఆనియన్స్ రంగు మారాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. అలా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ ధనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి మూతపెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ చికెన్ ఉడికే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో తోటకూర తరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిలో పెరుగు.. కొత్తిమీర తరుగు వేస్తే సరి సూపర్ టేస్టీ తోటకూర చికెన్ కర్రీ రెడీ అయినట్టే..
-
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications