టమాటా పచ్చడి ఇలా చేస్తే.. టిఫిన్, భోజనం అన్నిట్లోకి అదుర్స్!

పచ్చళ్ళు ఇష్టపడేవారు టమాటా పచ్చడిని ఇష్టపడకుండా అస్సలు ఉండరు. ప్రతినిత్యం మన ఇంట్లో వంటలలో ఉపయోగించే టమాటాలను పచ్చడి చేసి రోటి పచ్చడిగా తిన్నా, నిల్వ పచ్చడి చేసుకున్నా ఆ రుచే వేరని చాలామంది చెబుతారు. ప్రస్తుతం మనం అన్నంలోకే కాదు టిఫిన్స్ లోకి కూడా సూపర్ గా అనిపించే టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం.

టమాటా పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు
టమాటాలు- ఐదు నుండి ఆరు
పచ్చిమిరపకాయలు- 10
ఎండు మిరపకాయలు- 5
చింతపండు- ఉసిరికాయంత
ఉప్పు- రెండు టేబుల్ స్పూన్లు (రుచికి తగినంత)
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
వెల్లి పాయలు- 8 రెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు

tomato chutney making process tasty tomato chutney recipe for tiffins and food

టమాటా పచ్చడి తయారీ విధానం
పచ్చడి తయారీ విధానాన్ని చూసినట్లయితే ముందు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు తొడిమలు తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టౌ పైన పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను, పచ్చిమిరపకాయలను, ఎండు మిరపకాయలను, చింతపండును అందులో వేసి బాగా మగ్గనివ్వాలి.

ఇలా చేస్తే టమాటా పచ్చడి రుచికరం
టమాటా బాగా ఉడికి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని కాసేపు చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి అందులో రెండు స్పూన్ల సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒలిచి పెట్టుకున్న వెల్లి పాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా రుచికరంగా కావాలి అంటే పోపు చేసుకోవచ్చు.

ఎందులో తిన్నా ఈ టమాటా పచ్చడి అదుర్స్
పోపు చేసుకోకుండా తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా, దోసె, ఇడ్లీ, వడ వంటి టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం పైన పేర్కొన్న విధానంలో టమాట పచ్చడి చేసి ట్రై చేయండి. ఎందులో తిన్నా సరే అదుర్స్ అని మీరు ఫిక్స్ అవ్వాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+