రాయలసీమ స్పెషల్.. ఎల్లిపాయ కారం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..
చలికాలం వచ్చిందంటే చాలు.. ఏదైనా వేడి వేడిగానే చేసుకుని తినాలనిపిస్తుంది. అయితే వేడి వేడి అన్నంలో పాతకాలం నాటి ఎల్లిపాయ కారం వేసుకుని తింటే ఆ టేస్టే వేరు.. మరి ఎల్లిపాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం తీసుకోవాలి. ఈ వంటకు తక్కువ పదార్థాలే సరిపోతాయి. కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.
ఇక ఎల్లిపాయ కారం ఎలా చేయాలంటే..? ముందుగా వెల్లుల్లి రెబ్బలను తగినన్ని తీసుకోవాలి. వాటిని రోలులో వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఉప్పు, కారం తగినంత, వేసి బాగా దంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కారాన్ని నూనెతోపాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా మధురంగా ఉంటుంది.

వెల్లుల్లి కారం.. వర్షాకాలం, శీతాకాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఈ కారాన్ని అన్నంతోపాటు ఇడ్లీలోనూ తీసుకోవచ్చు. వెల్లుల్లి కారం క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. చాలా మంది జలుబు, దగ్గు సమయంలో ఈ వెల్లుల్లి కారాన్ని అప్పటికప్పుడు తయారు చేసుకుని లాగించేస్తుంటారు.












Click it and Unblock the Notifications