Sickle Cell disease: సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి? లక్షణాలేంటి?
సికిల్ సెల్ ఎనీమియా.. ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ ఎనీమియా గలవారిలో 50 శాతానికి పైగా మనదేశంలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి దీని వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులతో కొడవలి ఆకారంలో ఎర్ర రక్తకణాలు
ప్రతి మనిషి ఒంట్లో ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. పోషకాలు కూడా అవసరం ఉంటాయి. మనిషి శరీరానికి కావలసిన ఆక్సిజన్, పోషకాలు ఎర్ర రక్త కణాల ద్వారానే అందుతాయి. సహజంగా ఎర్ర రక్త కణాలు మృదువుగాను, గుండ్రంగానూ ఉంటాయి. కానీ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులలో ఇవి కొడవలి ఆకారంలోను లేదా నెలవంక ఆకారంలోనూ ఉంటాయి. జిగటగా, గట్టిగా తయారవుతాయి.

సికిల్ సెల్ వ్యాధి వీరిలోనే ఎక్కువ
ఎర్ర రక్త కణాలు ఈ విధంగా మారడం వల్ల రక్త సరఫరాకు ఇబ్బంది ఏర్పడి తీవ్రమైన నొప్పులు, రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనినే సికిల్ సెల్ ఎనీమియా అంటారు. సహజంగా ఇది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారిలో ఎక్కువగా వస్తుంది. గిరిజన ప్రాంతాలలోని ప్రజలలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఇక ఈ జన్యు కారక వ్యాధి కారణంగా ఈ జబ్బుతో పుట్టిన పిల్లల్లో 20శాతం మంది రెండు సంవత్సరాలలోపే చనిపోతున్నారు.
జాతీయ సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం
ఇక 30% మంది యుక్త వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీని గురించి అవగాహన లేకపోవడం, చికిత్స తీసుకోకపోవడం ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం.ఇక ఈ సికిల్ సెల్ ఎనీమియా పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ప్రధాన అవసరంగా భావించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు
సికిల్ సెల్ ఎనీమియా ఉన్నట్టు గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారికి చాతి, కడుపు, కీళ్లలోకి వెళ్లే సూక్ష్మ రక్తనాళాలలో తరచూ నొప్పి వస్తుంది. ఎముకల నొప్పులు కూడా తీవ్రంగా ఉంటాయి. సాధారణంగా సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారికి రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక నీరసంగా ఉంటారు. రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల కాళ్లలోనూ, చేతుల్లోనూ వాపులు వస్తాయి. విపరీతంగా నొప్పులు కూడా పుడతాయి.
సికిల్ సెల్ ఎనీమియాతో బోలెడు అనారోగ్య సమస్యలు
సికిల్ సెల్ ఎనీమియా వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. ఫ్లూ, నిమోనియా వంటి సమస్యలు వస్తాయి. ఇక పిల్లల్లో ఎదుగుదల కుంటుపడుతుంది. ఆడపిల్లలు రజస్వల కావడం కూడా ఆలస్యం అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియా వల్ల రెటీనా దెబ్బతిని కంటిచూపు తగ్గుతుంది. ఈ లక్షణాలు ఉంటే సికిల్ సెల్ ఎనీమియా బారిన పడ్డామని గుర్తించి తగిన చికిత్సలు తీసుకుంటే జీవనశైలి మార్పులు చేసుకుంటే ప్రాణహాని నుండి బయటపడవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications