చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? కారణాలివే.. నివారణలు ఇలా!!
చాలామంది చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుందని తెగ బాధపడుతున్నారు. ఒకప్పుడు వయసు మళ్ళిన వారికే జుట్టు తెల్లబడితే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతుంది. ఇది ప్రస్తుతం ఒక అతిపెద్ద సమస్యగా మారింది. చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? ఈ తెల్ల జుట్టు సమస్యలకు పరిష్కారం ఏమిటి? దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే అంశాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. .
జుట్టు తెల్లబడటానికి కారణాలివే
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి జెనెటికల్ కారణాలు ఉంటాయి. జెనెటికల్ గా అటువంటి సమస్య ఉంటే తగ్గించలేము కానీ మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపంతో తెల్ల జుట్టు సమస్య వస్తే మాత్రం దానిని కచ్చితంగా తగ్గించవచ్చు. సహజంగా శరీరంలో పౌష్టికాహార లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుందని చెబుతారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోతే జుట్టు తెల్లబడుతుంది. .
అంతేకాదు కొన్ని సందర్భాలలో ఒత్తిడికి కారణంగా కూడా జుట్టు తెల్లబడుతుంది.

ఈ కారనాలతోనూ తెల్ల జుట్టు
ఒత్తిడి శరీరంలో ఉండే మైటోకాండ్రియా మార్పులకు కారణం అవుతుంది. ఇది జుట్టు ప్రోటీన్ ను తగ్గిస్తుంది. వెంట్రుకలు తెల్లబడడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలామంది ఎక్కువ తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. ఎక్కువసేపు ఎండలో తిరిగే వారిలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది కూడా తెల్ల జుట్టు సమస్యలకు కారణమవుతుంది.
జుట్టు తెల్లబడటం నివారించేందుకు మార్గాలు
ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల తీవ్రమైన సూర్యరశ్మికి జుట్టు గురి కావటం వల్ల మన జుట్టులో ఉండే ప్రోటీన్లు నాశనం అయిపోయే జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే తెల్లబడుతున్న జుట్టును మళ్ళీ నల్లగా మార్చుకోవడానికి ఏం చేయాలి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలనుకునేవారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఉసిరి, ఉల్లిపాయలతో బెస్ట్ రిజల్ట్స్
ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయ రసాన్ని వారానికి రెండు రోజులు జుట్టుకు బాగా పట్టిస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, ఆంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇవి తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తాయి.
కరివేపాకుతో తెల్ల జుట్టుకు చెక్
ఇక కరివేపాకు పేస్ట్ ను పెరుగుతో కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడుక్కుంటే కూడా జుట్టు తెల్లబడడం తగ్గుతుంది కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి ఇవి తెల్లజుట్టు సమస్యను నివారించడంలో కీలకంగా పనిచేస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications