ఉదయం.. ఫలాహారం ఎంతో మంచిది...
రోజువారి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయం పూట టిఫిన్ తినడం మానేస్తుంటారు. టిఫిన్ తినడానికి వీలుకాకపోయినా ఉదయం పండ్లను కూడా తినొచ్చంటున్నారు నిపుణులు.. మన రెగ్యులర్ డైట్‌లో ఉదయం పండ్లు తీసుకోవడం చాలా అవసరం. పండ్లు తీసుకోవడానికి వయసుతో పనిలేదు. అన్నిరకాల పండ్లను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొత్తానికి పండ్లు మనకు ఎనర్జీ బూస్ట్‌గా సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మనల్ని ఉత్సహంగా ఉంచుతాయి.
ప్రతిరోజూ ఉదయం ఒక ఆపిల్ తినడం వల్ల అది ఎంతో శక్తిని అందిస్తుంది. ఆపిల్, ఆరెంజ్, అరటిపండు ఉదయం పూట తీసుకోవడం మంచిది. పండ్లలో కార్బొహైడ్రైట్స్ అధికంగా ఉండడం వల్ల రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అవి అందిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది...:పండ్లు క్లీనీంగ్ ఫుడ్స్‌గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం వీటిని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్‌ను బయటకు నెట్టివేస్తాయి. అంతేకాదు, జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదపడతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు పండ్లు సహాయపడతాయి.
వీటిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి..:వీటిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆహార నిపుణులు ఉదయాన్నే పండ్లను తీసుకోవాలని సలహాలు, సూచనలు చేస్తుంటారు.ఈ ఎంజైమ్స్ శరీరంలోని వివిధ రకాల జీవక్రీయలు పనిచేయడానికి సహాయపడతాయి. తిన్న ఆహారం నేచురల్‌గా జీర్ణం కావడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.

రోజులో ఎక్కువమోతాదులో ఆహారం తీసుకోవడం కంటే, వాటి స్థానంలో కొద్దిగా పండ్లు తీసుకుంటే అవి శరీరానికి నేచురల్ గ్లూకోజ్‌ను అందిస్తాయి. ఇవి మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. ఎందుకుంటే వీటిలో నేచురల్ షుగర్స్, పైబర్ ఉండడం వల్ల మానసిక శక్తిని అందిస్తాయి.
విటమిన్ సి పండ్లు ఎంతో మేలు..:విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ఉదయం తీసుకుంటే ఒత్తిడి తగ్గించడానికి ఎంతోగానో సహాయపడతాయి. ఉదయం పూట పండ్లు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేషన్‌లో ఉంటుంది. నేచురల్‌గానే డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం పండ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. త్వరగా బరువు తగ్గించడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. వీటిలో నేచురల్ షుగర్స్, తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా అందిస్తాయి.












Click it and Unblock the Notifications