వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RRB NTPC 7th Phase exam: పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది.. మీరు అప్లయ్ చేస్తే చెక్ చేసుకోండి..!

|
Google Oneindia TeluguNews

రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికోసం ఈ అప్‌డేట్. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆర్‌ఆర్‌బీ ద్వారా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే వారికోసం ఆర్‌ఆర్‌బీ నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఆర్‌ఆర్‌బీ నిర్వహించే ఎన్టీపీసీ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం ఏడు దశల్లో ఈ పరీక్షను నిర్వహిస్తుండగా ఇప్పటికే ఆరు దశలు పూర్తయ్యాయి. ఇక చివరిదైన ఏడవ దశ పరీక్ష షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం RRB NTPCఫేజ్ 7 పరీక్ష జూలై 23, 24, 26, మరియు 31వ తేదీన జరుగుతుంది. అప్లయ్ చేసిన అభ్యర్థులంతా ఈ రోజులను నోట్ చేసుకోవాలని సూచించింది.

ఇక ఏడవ దశ పరీక్షలో భాగంగా మొత్తం 2.78 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆర్‌ఆర్‌బీ పేర్కొంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఆర్‌ఆర్‌బీ పలు పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది. ఇక కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆర్‌ఆర్‌బీ కూడా ఆయా రైల్వేజోన్లలో లేదా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఈ నెలాఖరులోగా అన్ని దశల పరీక్షలు పూర్తవుతాయి. కరోనా ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు.

 RRB NTPC 7th Phase exam: Know the exam date, centre and other details here

ఇక పరీక్షకు 10 రోజుల ముందు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌పై పరీక్ష కేంద్రంకు సంబంధించిన వివరాలు మరియు తేదీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు గల పాస్‌లను ఉంచనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తెలిపింది. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. ఇక పరీక్ష రాసే అభ్యర్థులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫేసు మాస్కు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక ముఖానికి మాస్కు ధరించిన వారిని మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులు మాస్కు ధరించి ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. ఒక్క ఫోటో తీసే సమయంలో మాత్రమే మాస్కును పక్కన పెట్టొచ్చని అది అయ్యాక తిరిగి మాస్కు ధరించాలని ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: http://www.rrbcdg.gov.in/uploads/NOTICE_on_7th_Phase_01_07_2021.pdf

English summary
RRB releases schedule for the 7th phase of NTPC RRB exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X