తెలంగాణ జెన్‌కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెన్‌కో)లో అసిస్టెంట్ ఇంజినీర్(AE), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కారణంగా మార్చి 31న జరగాల్సిన పరీక్షలను జెన్ కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
జెన్ కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యూలర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసింది. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి పలు పరీక్షల తేదీలు మారిన విషయం తెలిసిందే.

తెలంగాణ టెట్ దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)కు దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా https://tstet2024.aptonline.in/tstet/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ఆధారిత టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3 మధ్య రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. మే 15 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల చేస్తారు.
టెట్ ఒక పేసర్ రాసేందుకు రూ. 1000, రెండు పేపర్లు రాసేందుకు రూ. 2 వేలు చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. టెట్ పేపర్-1 రాసేందుకు డీఈడీ, పేపర్-2 రాసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలి.
కాగా, 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ(DSC) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications