వాదులాట ఎందుకంటే...

టీచర్ తరగతి గదిలోకి వచ్చే సరికి ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు.

టీచర్ గట్టిగా అరిచి - "ఎందుకు కొట్లాడుకుంటున్నారు?" అని అడిగింది.

"మాకు వేయి రూపాయల నోటు దొరికింది, టీచర్..! నమ్మే విధంగా ఎవరు అబద్ధం చెప్తే వారికి ఇవ్వాలని అనుకుంటున్నాం" చెప్పాడు ఓ విద్యార్థి.

"నోర్మూసుకోండి.. మీ వయస్సులో అబద్ధమంటే ఏమిటో కూడా నాకు తెలియదు" చెప్పింది టీచర్.

వేయి రూపాయల నోటును వారు టీచర్‌కు ఇచ్చేశారు.

...... ..... .......

ఓ వ్యక్తి వైద్యుడి వద్దకు వచ్చి - "డాక్టర్..! దీంతో ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పి పుడుతోంది" చెప్పాడు.

"అంటే.." అడిగాడు డాక్టర్.

వేలు చూపిస్తూ.. "దీంతో మరో చేయిని తాకితే నొప్పి పెడుతోంది. నుదటి మీద పెడితే నొప్పి వస్తుంది. కాలిని ముట్టుకుంటే నొప్పి పుడుతోంది" వివరించాడు ఆ వ్యక్తి.

"నాకు అర్థమైంది. నీ వేలు విరిగింది" చెప్పాడు డాక్టర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+