శక్తివంతమైన శని త్రయోదశి.. నక్కతోక తొక్కే రాశులివే!
శని త్రయోదశి జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రేపు డిసెంబర్ 28వ తేదీన ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశిని జరుపుకుంటున్నాం. శనివారం నాడు వచ్చిన ఈ శని త్రయోదశి అనురాధ నక్షత్ర యుక్తంగా చాలా పవర్ ఫుల్ గా చెప్పవచ్చు. ఇక డిసెంబర్ 28వ తేదీ శనిత్రయోదశి రోజు నుంచి గ్రహాలస్థితి మారడం వల్ల ఐదు రాశులవారికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.
మేషరాశి
డిసెంబర్ 28 నుంచి మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కెరీర్ లో పురోగతి వస్తుంది. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి. అయితే వీటిని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఇది మేషరాశి వారికి శుభ సమయం.

వృషభ రాశి
శని త్రయోదశి వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకం. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఇది వృషభ రాశి వారి మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. ఇప్పటినుంచి వీరికి అదృష్టం మొదలు కాబోతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి శని త్రయోదశి రోజు నుంచి గొప్ప విజయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తే రేపు వారికి శుభ సమయం గా చెప్పవచ్చు. సింహ రాశి వారికి శని త్రయోదశి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు సంతోషంగా జీవిస్తారు.
వృశ్చిక రాశి
శని త్రయోదశి రోజు వృశ్చిక రాశి వారికి సంపదలు వర్షం కురవబోతోంది. ఈ శని త్రయోదశి వృశ్చిక రాశి వారికి కొత్త ప్రారంభం తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరి సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పనిపై మెరుగ్గా దృష్టి సారించగలుగుతారు.
మీన రాశి
శని త్రయోదశి రోజు మీన రాశి వారికి వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. శని త్రయోదశి నాటి గ్రహాల స్థితి కారణంగా వీరు అదృష్టవంతులుగా మారుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications