వాస్తు ప్రకారం ఇంట్లో మాస్టర్ బెడ్‌రూం ఎటువైపు ఉండాలంటే!
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకునే సమయంలో అందరికీ పలు సందేహాలు వస్తుంటాయి. ముందుగా మాస్టర్ బెడ్ రూం అంటే.. ఇంటి యజమానికి సంబంధించిన బెడ్ రూం ఎటువైపు ఉండాలి అని. అయితే ఇది ఎప్పుడూ పశ్చిమ దిక్కులోకానీ, దక్షిణ దిక్కులో కానీ పెరగకుండా ఉండాలి. చాలామంది తెలియక నైరుతికి, పడమరకు రెండు నుంచి మూడు అడుగులు పెంచి బెడ్ రూం కడుతుననారు. అంతేకాదు.. వాయువ్యానికి, పశ్చిమానికి కారు పార్కింగ్ ఇవ్వంతోపాటు తలుపును మధ్యలో ఇస్తున్నారు. ఇది చాలా దోషమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కొలతలు సరిగా పాటించకపోతే నష్టాలు
ఇల్లు నిర్మించే సమయంలో కొలతలు సరిగా పాటించకపోతే అనుకోకుండా కష్టాలు వస్తాయి. వాటిని ఆకస్మిక కష్టాలు అంటారు. ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. కింద, పైన కూడా పెంచకూడదు. అదేమని అడిగితే వాయువ్యం, పడమర అంతా బాల్కనీ ఉందికదా అని చెబుతుంటారు. కానీ అది తప్పు. పశ్చిమం, వాయువ్యం బాల్కనీ భాగాన్ని ఇంట్లోకి కలుపుకోవాలి.

పశ్చిమ దిక్కును సమానం చేసుకోవాలి. ఇంట్లో కార్పెట్ ఏరియా నైరుతి వైపు పెరగకూడదు. బాల్కనీలు ఇంటి లోపలి భాగంలోకి రావు. బాల్కనీ అనేది ఇంటి బయట ఉండాలి. ఉత్తర దిక్కును, దక్షిణ దిక్కును కలుపుతూ ఉండాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే మీరు ఇంటిని సరిచేసుకోవడం ఉత్తమ.
అటువైపు ఈ చెట్లు పెంచొద్దు
అలాగే మనిషికి విటమిన్ డి చాలా అవసరం. ఉదయం సమయంలో సూర్యరశ్చి ద్వారా దీన్ని అందుకోవచ్చు. అయితే చెట్లు పెంచడంవల్ల వీటిని నిరోధిస్తాయి. అందుకే తూర్పుతోపాటు ఈశాన్యంలో చెట్లను పెంచకూడదు. అవి వెలుగును అడ్డుకుంటాయి. ఇంటి ప్రహరీ దాటని పూలమొక్కలను మాత్రం తూర్పువైపు, ఉత్తరంవైపు చక్కగా ఎటువంటి అనుమానాలు లేకుండా పెంచుకోవచ్చు. మహా వృక్షాలుగా పేరు తెచ్చుకున్న జిల్లేడు, మర్రి చెట్టు జువ్వి చెట్టు, రావి చెట్టు, చింత చెట్టు లాంటివి ఇంట్లో పెంచొద్దు. పొలాల్లో, ఇతర ఖాళీ స్థలాల్లో, వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతాల్లోపెంచుకోవచ్చు.












Click it and Unblock the Notifications