దీపావళి తర్వాత వీరికి సిరి సంపదలను ప్రకటించిన శని!
సాధారణంగా శని గ్రహాన్ని న్యాయదేవతగా పరిగణిస్తారు. శని క్రమశిక్షణను ఇచ్చే దేవుడు, సహనాన్ని ఇచ్చే దేవుడు. శని జాతక చక్రంలో ఆరవ, ఎనిమిదవ, 12వ గృహాలలో ఉంటే అశుభమైనదిగా పరిగణిస్తారు శని రెండవ, నాల్గవ, ఐదవ, ఏడవ, 9వ మరియు 11వ గ్రహాలలో ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెబుతారు. కుంభ మకర రాశులకు అధిపతి అయిన శని ప్రస్తుతం తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు.
శని ప్రత్యక్షం.. అదృష్ట రాశులు
శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. శని ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారాన్ని సాగిస్తున్నాడు. ఇక ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనములో సంచరిస్తున్న శని నవంబర్ 15 సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకు కుంభరాశిలో ప్రత్యక్షమవుతాడు . కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా దీపావళి తర్వాత వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిధున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అదృష్టవంతులుగా పరిగణించబడుతున్నారు. వారి జీవితంలోని ప్రతి అంశం లోను విజయం వరిస్తుంది. ధన లాభం కలగడంతో పాటు ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కెరీర్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.
మేష రాశి
కుంభరాశిలో శని ప్రత్యక్షం కారణంగా మేషరాశి జాతకులు లాభాలను పొందుతారు. మేష రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వివిధ రంగాలలో విజయం సాధించగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎలాంటి ఆర్థిక సంక్షోభాల వల్ల ఇబ్బంది ఎదురు కాదు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
మకర రాశి
కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వీరి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications