బుధుడి వక్రమార్గంతో ఈ రాశులకు అద్భుతమైన సంపద
గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలు, జ్ఞానం, తర్కం, లెక్కలకు, వ్యాపారానికి కారకుడు. సక్రమ మార్గ సంచారం నుంచి వక్రమార్గంలోకి మారినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి బుధుడు తిరోగమనంలోకి వెళుతున్నాడు. దీనివల్ల మార్చి నెలాఖరు వరకు కొన్ని రాశుల అన్నిరకాల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా అత్యధికంగా లాభపడే రాశుల వివరాలను కూడా తెలుసుకుందాం.
తులారాశి
డబ్బు లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆలోచనా స్థాయిని పెంచుకుంటారు.

కుంభరాశి
కెరీర్ పరంగా ముందుగా ఒక ప్రణాళిక రచించుకొని దాన్ని అమలు చేసుకుంటూ వెళతారు. ఐటీ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులకు దిగుమతుల వల్ల ఆదాయం పెరుగుతుంది.
వృషభ రాశి
అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. అనుకున్న పనుల్లో విజయాలు మీ సొంతమవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. బుధుడి ప్రభావంతో వీరు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు. అవకాశాలు కూడా మంచివి దొరుకుతాయి. నిర్ణయాలు సరైనవి తీసుకుంటారు.
మిథున రాశి
కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అయితే అదే సమయంలో ఊహించనిస్థాయిలో తగ్గిపోతాయి. మిగిలిన డబ్బును పొదుపు చేసుకోవాలి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులన్నీ చాలా సులువుగా పూర్తవుతాయి.
కన్యారాశి
ఆందోళన తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. జీవితంలో మంచి స్థాయికి వెళతారు. ఆదాయపు వనరులు పెరుగుతాయి. జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఏ పని తలపెట్టినా అందులో నుంచి డబ్బు వస్తుంది.












Click it and Unblock the Notifications