నేటినుండి మొదలైంది వీరికి ధనలక్ష్మీ యోగం .. ఇదే కుజుడి శాసనం!
గ్రహాలలో ముఖ్య గ్రహమైన కుజుడు డిసెంబర్ 7వ తేదీన అంటే నేడు కర్కాటక రాశిలోకి తిరుగమనం చెందుతున్నాడు. కుజుడు తిరోగమన సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం తెచ్చిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ఆత్మవిశ్వాసానికి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలుస్తాడు. జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి అన్ని విధాల శుభాలను చేకూరుస్తాడు.
కుజుడి తిరోగమన సంచారం
కుజుడు ప్రతి 45రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుజుడి సంచార ప్రభావం అన్ని రాశులపైన కచ్చితంగా ఉంటుంది. కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నాడు. డిసెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 5.01నిమిషాలకు కుజుడు తిరోగమన స్థితిలోకి వచ్చాడు. నేటి నుంచి జనవరి 2025 వరకు కుజుడు తిరోగమన సంచారమే చేస్తాడు. ఇక కుజుడు తిరోగమన సంచారం కారణంగా మూడు రాశులవారికి ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది.

కన్యారాశి
కర్కాటక రాశిలో కుజుడి తిరోగమన సంచారం ప్రభావం కన్యారాశి వారి పైన పడుతుంది. కన్యారాశిలో 11వ గృహంలో కుజ సంచారం జరుగుతుంది. దీనివల్ల కన్యా రాశి వారికి ధనలక్ష్మి యోగం వస్తుంది. నేటి నుంచి వీరి జీవితం సంపదలతో తులతూగుతూ సాగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి శ్రమకి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది.
తులారాశి
కుజుడి తిరోగమన సంచారం తులారాశి వారికి సంపదలను తెచ్చిపెడుతుంది. ధనలక్ష్మి యోగం ప్రభావంతో తులారాశి జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు . కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆర్థికంగా వేగంగా పురోగతి సాధించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తులా రాశి జాతకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదృష్ట లక్ష్మి ఈ సమయంలో వీరిని వరిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
మీనరాశి
మీన రాశి వారికి కుజుడి తిరోగమన సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీన రాశి జాతకులు అన్ని రంగాలలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 24 వరకు మీన రాశి వారికి కుజుడు అదృష్టాన్ని ఇస్తాడు. పోటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరు ఈ సమయంలో విజయం సాధిస్తారు. జీవితంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకొని భారీ లాభాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications