Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్షయ తృతీయ రోజు ఈ పనులు అస్సలు చెయ్యొద్దు.. అలా చేస్తే పేదరికం వస్తుంది!!

అక్షయ తృతీయ దగ్గరకు వచ్చేస్తోంది. అక్షయ తృతీయ రోజు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి, బంగారాన్ని కొనుగోలు చేసి, సకల సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా, పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయను చెప్పుకుంటారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖమాసంలోని శుక్లపక్షం తదియ తిథినాడు అక్షయ తృతీయ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 22 వ తేదీన ఉదయం 7 గంటల 49 నిమిషాలకు ప్రారంభమే ఏప్రిల్ 23 వ తేదీన ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ముగుస్తుంది.

Akshaya Tritiya

అయితే ప్రాతఃకాల సమయంలో ఉన్న తిథిని బట్టి పండుగలు చేసుకునే ఆనవాయితీ హిందువులకు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 22 వ తేదీన పూర్తిగా తదియ తిథి ఉంది కాబట్టి అక్షయ తృతీయ పండుగను 22వ తేదీన జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ పండుగ నాడు తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున చేసే కొన్ని తప్పులు వల్ల పేదరికం వస్తుందని చెబుతున్నారు.

అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు మాంసాహారాన్ని భుజించకూడదు. వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డల తో వండిన ఆహారాన్ని తినకుండా ఉండడమే మంచిది. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అక్షయ తృతీయ పండుగనాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులను తుంచకూడదు.

ఇంటిని ఎక్కడా మురికిగా ఉంచకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజు ఎవరిని తిట్టకూడదు. కోపం, ద్వేషం, అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు. పవిత్రంగా అమ్మవారిని పూజించాలి. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దలు చేతులమీదుగా అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+