గురుపూర్ణిమ నాడు ఈ పనులు చెయ్యండి; వ్యాపారంలో తిరుగుండదు!!
ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం గురుపూర్ణిమను చాలా ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం జులై 3 వ తేదీన గురు పూర్ణిమను జరుపుకోనున్నారు. అయితే ఈసారి గురుపూర్ణిమనాడు బ్రహ్మ మరియు ఇంద్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఈసారి గురుపౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే వ్యాపారంలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది.
చాలామంది వ్యాపారంలో ఎంత కష్టపడినా ఫలితం లేక బాధ పడుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు ఈ ఏడాది గురుపూర్ణిమ నాడు వ్యాపార వృద్ధికి కొన్ని పనులు చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుంది. గురు పూర్ణిమ నాడు ఇంట్లో గురు యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి గురువారం పూజిస్తే మంచి జరుగుతుంది. దీనితో జాతకంలో బృహస్పతి బలంగా మారుతాడు. పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గురుపౌర్ణమినాడు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్ లు, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి సామాను దానం చేయడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఇక ఈశాన్య దిక్కు గురు గ్రహానికి సంబంధించింది కావడంతో, గురు పౌర్ణమి రోజున ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుంది.
అంతేకాదు గురుపౌర్ణమి రోజున గురువులను పూజిస్తే కూడా గురు బలం పెరుగుతుంది. ఆ రోజున గురువును భోజనానికి ఆహ్వానించి, మంచి భోజనం పెట్టి ఆతిధ్యం ఇచ్చి, ఆయనకు దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందడం ద్వారా కూడా గురు గ్రహం బలపడుతుంది. ఫలితంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.
గురుపౌర్ణమి రోజున విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది. శివుడిని పూజించినా, దత్తాత్రేయుడిని ఆరాధించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో పురోగతి సాధించాలని భావించేవారు బ్రహ్మ, ఇంద్ర యోగాల మేళవింపుగా వస్తున్న గురు పూర్ణిమ నాడుతప్పక పైన చెప్పిన పనులను చెయ్యండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications