జనవరి 4 నుంచి ఈ రాశులకు అద్భుత మహా రాజయోగం పట్టుకుంది

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాల రాకుమారుడైన బుధుడు 4వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు, బుధుడు కలవడంవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడి కొన్ని రాశులవారికి ఆర్థికంగా కలిసిరాబోతోంది. దీనివల్ల ఏడాది ప్రారంభంలోనే కెరీర్ పరంగా విజయాన్ని అందుకోవడంతోపాటు మంచి వృద్ధి సాధిస్తారు. బుధుడివల్ల వ్యాపార వర్గాలవారు విజయాలను అందుకుంటారు. ఏయే రాశులవారు ఏవిధంగా వీరిద్దరి కలయికవల్ల లాభపడతారనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనుస్సు
ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. బుధుడివల్ల మీ ఆలోచన పదునెక్కి విజయాలను సాధిస్తారు. అమ్మమ్మ తరఫు నుంచి ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలను మీరే సొంతంగా ఆలోచించి తీసుకోవాలి.

five zodiac signs will get healthy life and money due to Mercury enters Sagittarius on the january 4th

మీనం
జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు దొరికి సంతోషంగా జీవిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్నేహితుల నుంచి పూర్తిగా సహకారం అందుతుంది. కుటుంబంతో గడపడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.

మేషం
కెరీర్ పరంగా విజయాలు అందుకుంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. పిల్లలు కూడా విద్యలో రాణిస్తారు. దీనివల్ల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి.

మిథునం
ఉద్యోగస్తులకు సీనియర్లతో ఉన్న అనుబంధం ఈ సమయంలో బాగా బాలపడుతుంది. వ్యాపారాల్లో ఉన్నవారు భాగస్వామితో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. కలిసిమెలిసి వ్యాపారం చేస్తారు. ప్రయాణం చేస్తారు. అది కూడా లాభసాటిగా ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ ఇద్దరిలో ఒకరన్నా సర్దుకుపోవాలి. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు.

సింహం
డబ్బును ఆదా చేస్తారు. భవిష్యత్తులో ఇవి మంచి పెట్టుబడులను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపుతడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. జీవిత భాగస్వామితో ఎంతో ప్రేమగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+