సూర్యచంద్రుల కలయిక ఈ రాశుల దశ, దిశను మారుస్తోంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. సూర్యుడు నిరంతరం తన రాశిని మారుస్తుంటాడు. ప్రతి 30 రోజులకు ఒకసారి రాశి సంచారం చేస్తుంటాడు. ఈనెల 27న సూర్యుడు మేషరాశిలో ఉండగా, చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించాడు. చాలాకాలం తర్వాత సూర్య, చంద్రుల కలయిక జరిగింది. ఇటువంటి అరుదైన పరిణామం కొన్ని రాశులకు మంచి ఆరోగ్యాన్ని కల్పించి ఆర్థికంగా మంచి స్థితికి తీసుకువస్తుంది. ఏయే రాశులకు సూర్యచంద్రుల కలయిక కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో? లేదో? చూసుకోండి.
మేషరాశి
డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు చాలా మేలు కలుగుతుంది. ఆదాయం పెరిగి కొత్త వ్యాపారాల కోసం ఆలోచిస్తుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్థులకు కూడా ఈ సమయం కలిసివస్తుంది. వేతనం పెరగడంతోపాటు పదోన్నతులుంటాయి. కోరుకున్నచోటకు ఉద్యోగంపై వెళ్లాలంటే మాత్రం శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కొంచెం అధికంగా కష్టపడాలి.

సింహరాశి
సమాజంలో మంచి హోదా లభించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వీటివల్ల ఆర్థిక లాభాలున్నాయి. మానసిక సమస్యలవల్ల ఇబ్బందులు పడుతున్నవారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ప్రత్యర్థులపై విజయాలను అందుకుంటారు.
కన్యా రాశి
వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నవారు వాటి నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలు కుదురుతాయి. వాటివల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. విద్యార్థులకు కలిసివస్తుంది.
ధనస్సు రాశి
కెరీర్ పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా సమస్యలతో ఉన్నవారికి ఇది బాగా కలిసివచ్చే సమయం. ప్రతి పనిలోను విజయాన్ని సులువుగా అందుకుంటారు.












Click it and Unblock the Notifications