హాల్ వాస్తు.. లివింగ్ రూమ్ లో ఈ వస్తువులు అసలే పెట్టొద్దు

వాస్తు... ప్రతి ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. ఇంటికి మాత్రమే కాదు కార్యాలయమైనా, కమర్షియల్ బిల్డింగ్ అయిన ఏది కట్టిన వాస్తు ప్రకారమే కట్టాలి. వాస్తు ప్రకారం కట్టుకున్నప్పుడు ఆ భవనానికి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటిని మనం వాస్తు ప్రకారం నిర్మాణం చేసుకుంటాం. ఇల్లు వాస్తు ప్రకారం కట్టాము అని ఇంట్లో పెట్టే వస్తువులు, పెట్టకూడని వస్తువులు వంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించం.

ఇంట్లో హాల్ కు వాస్తు
ఇంట్లోని ప్రతి గదికి దేనికదే ప్రత్యేకమైన వాస్తు ఉంటుంది. ఇంట్లో హాల్ కు కూడా ప్రత్యేకమైన వాస్తు కచ్చితంగా ఉంటుంది. హాల్ ఎప్పుడు తూర్పు, ఉత్తర దిశలలో డోర్స్ ఉండేలా నిర్మాణం చేసుకోవాలి. వాస్తు ప్రకారం ఈ దిశలో తలుపులు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ దిశలోనే డోర్స్ ఉండేలా పెట్టుకోవాలి. ఇక హాల్లో ఫర్నిచర్ ను వాస్తు ప్రకారమే అమర్చుకోవాలి.

Hall Vastu Don t put these items in the living room

ఈ వస్తువులు హాల్ లో పెట్టకూడదు
సోఫాలు కుర్చీలు హాల్ కు నైరుతి, టీవీ ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. ఇక హాల్లో బరువైన వస్తువులు ఏవైనా ఉంటే నైరుతి దిశలోను, చిన్న వస్తువులు ఈశాన్య దిశలోను పెట్టుకోవడం మంచిది. హాల్లో ముఖ్యంగా పెట్టకూడని కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దాలు, పాడైపోయిన వస్తువులు, మురికి వస్తువులు, పాత సామాన్లు హాల్లో పొరపాటున కూడా పెట్టకూడదు.

హాల్ లో ఇవి పెడితే ఆర్ధిక సమస్యలు
కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు కూడా హాల్లో పెట్టకూడదు. పాత వస్తువులు, ఉపయోగించని వస్తువులు హాల్లో పెట్టడం మంచిది కాదు. ఇటువంటి వస్తువులు హాల్లో పెట్టడం వల్ల ఇంటికి ప్రతికూల శక్తి వస్తుంది. ఎవరైతే హాల్లో పెట్టకూడని వస్తువులను పెట్టి ఇంటిని నీట్ గా మెయింటైన్ చేయరో వారు అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోను బాధపడాల్సి వస్తుంది.

హాల్ లో అవి పెడితే అనవసర చిరాకులు
హాల్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి తగిన వస్తువులు, ఇంటికి అవసరమైన వస్తువులు మాత్రమే హాల్లో పెట్టుకోవాలి. అనవసరమైన వస్తువులను హాల్లో పెడితే అనవసరమైన చిరాకులు తప్ప వచ్చే లాభం ఉండదు. కనుక హాల్ నిర్మాణం లోనే కాదు, వస్తువులు పెట్టే విషయంలో కూడా వాస్తు పాటించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+