today rashiphalalu: ఐశ్వర్యం సిద్ధిస్తుంది, విదేశీ సంబంధం కుదురుతుంది
శుక్రవారం అమావాస్య కావడంతో ఈ రోజు పితృ దేవతలకు తర్పణాలు వదిలితే పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
పరాభవ నామ సంవత్సరం,
చైత్ర అమావాస్య సాయంత్రం 5.23 గంటల వరకు,
నక్షత్రం: ఉత్తరాభాద్ర
రాహుకాలం: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
యమగండం: మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు

మేషం
చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు.
మిథునం
శుక్రుడి అనుకూలత వల్ల ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.
కర్కాటకం
కొత్త వ్యాపార ఆలోచనలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
సింహం
పాత గొడవలు సమసిపోతాయి. కొత్త బాధ్యతలు మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మిత్రుల నుండి ఆశించిన సహకారం అందుతుంది.
కన్య
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపాలి.
తుల
ఈ రోజు మీకు లక్కీ టైమ్ అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి విదేశీ సంబంధం ఖాయం కావచ్చు.
వృశ్చికం
వృత్తిపరంగా కీలకమైన మార్పులు వస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల ఫలితాలు రావచ్చు.
ధనుస్సు
కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. సంతాన యోగం లేదా పిల్లల వృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త ఇల్లు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం
స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బంధువులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కుంభం
వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం
గ్రహాల సంచారం వల్ల మీ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుంది. మాట తీరుతో కార్యకలాపాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు మెండుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications