డిసెంబర్ లో శుక్రుడి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దిష్ట సమయంలో జరుగుతూ వస్తుంది. అప్పుడప్పుడు గ్రహాలు తిరోగమనం కూడా చెందుతాయి. గ్రహాల సంచారం, వివిధ గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ సంవత్సరం చివరి నెల అయిన డిసెంబర్ లో మాత్రం గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది.

డిసెంబర్ లో శుక్ర సంచారం
ముఖ్యంగా విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో రెండుసార్లు సంచారం చేయనున్నాడు. మొదట మకర రాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ రెండవ తేదీన శనిపాలించే మకర రాశిలోకి, అలాగే రెండవసారి డిసెంబర్ 28వ తేదీన శని అధిపతిగా వ్యవహరించే కుంభరాశిలోకి శుక్ర సంచారం జరుగుతుంది. ఇది వివిధ రాశుల వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

In December month Venus double transit gives huge wealth to these zodiac signs

వృషభ రాశి
శుక్ర సంచారం కారణంగా డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి విశేష ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో అద్భుతమైన లాభాలను ఇస్తాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి
మకర రాశి వారికి కూడా శుక్రుడు రెండుసార్లు సంచారం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో చేపట్టిన ఏ పనులైనా విజయాలను సాధిస్తాయి. ఇక మకర రాశి వారికి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇది లాభాలను చేకూర్చే సమయం.

తులారాశి
శుక్రుడి ప్రభావం తులారాశి వారికి కూడా అదృష్టాన్ని ఇస్తుంది. తులా రాశి వారు వ్యక్తిగత జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూలతలు చూస్తారు. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. తులా రాశి వారు ఈ సమయంలో సుఖంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+