2025లో షడష్టక యోగంతో వీరికి కుబేరయోగం.. వరమిచ్చిన బృహస్పతి సూర్యులు!

2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం అనేక యోగాలకు కారణమవుతుంది. 2025 లో సూర్యుడు మరియు బృహస్పతి తమ ప్రత్యేక స్థానం ద్వారా షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. రెండు గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు లేదా రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది.

2025లో సూర్యుడు బృహస్పతితో షడష్టక యోగం
ఈ షడష్టక యోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలతలను తీసుకువస్తుంది. సూర్యుడు శక్తికి మరియు అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక బృహస్పతి జ్ఞానానికి, శ్రేయస్సుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అటువంటి ఈ రెండు గ్రహాలు ఏర్పరుస్తున్న షడష్టక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి 2025 సంవత్సరంలో సూర్యుడు మరియు బృహస్పతి కారణంగా ఏర్పడుతున్న షడష్టక యోగంతో లబ్ధిని పొందే రాశులు తెలుసుకుందాం.

Jupiter and Sun have bestowed Kubera Yoga on these zodiac signs with Shadashtak Yoga in 2025

మేష రాశి
షడష్టక యోగం కారణంగా మేషరాశి జాతకులకు 2025 సంవత్సరంలో పురోగతి కనిపిస్తుంది. ఇది మేషరాశి జాతకులకు కొత్త ఉద్యోగ అవకాశాలను, ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. వ్యక్తిగతంగా ను మేషరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ విషయాల్లోనూ మేషరాశి జాతకులు పురోగతిని చూస్తారు. అయితే ఈ సమయంలో సంకోచం లేకుండా అవకాశాలను ఉపయోగించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి మేషరాశి జాతకులు దృష్టి సారించాలి.

సింహరాశి
షడష్టక యోగం కారణంగా సింహరాశి జాతకులు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి జాతకులకు వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. సింహరాశి జాతకుల నాయకత్వాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. సింహరాశి వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. సంతోషంగా జీవిస్తారు. అయితే సింహరాశి వారు ఈ సమయంలో నాయకత్వ అవకాశాలను స్వీకరించడం మంచిది.వృత్తిపరమైన, వ్యక్తిగతమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి

ధనుస్సు రాశి
షడష్టక యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులు గణనీయమైన ప్రగతిని సాధిస్తారు. 2025 సంవత్సరం ధనుస్సు రాశి వారికి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అనువుగా ఉంటుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యక్తిగతంగానూ చాలా సంతోషంగా ధనుస్సు రాశి జాతకులు ఉంటారు. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తు ఆధారిత ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ వ్యవధి చాలా బాగా ఉపయోగపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+