బృహస్పతి తిరోగమనంతో 248 రోజులు ఈ రాశుల దశ తిరిగినట్టే!!
వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతి సంచారం అన్నిరాశులవారి జీవితాలలోనూ గణనీయమైన మార్పులను తెస్తుంది. అయితే బృహస్పతి తిరోగమనం చెందడం కూడా ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ఉదయం 10 గంటల 01 నిముషానికి వృషభ రాశిలో తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు.
బృహస్పతి తిరోగమనం
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4 2025 రాత్రి 1:46 వరకు బృహస్పతి అక్కడే తిరోగమన స్థితిలో ఉంటారు. బృహస్పతి తిరోగమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. 248 రోజులు వీరికి నక్కతోక తొక్కినట్టే సంపద కలిసొస్తుంది. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా మిధున రాశి జాతకులకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు రాకతో మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో కూడా మిధున రాశి జాతకులు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బృహస్పతి తిరోగమనం మంచి ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి తిరోగమనం కారణంగా ఈ సమయంలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బృహస్పతి తిరోగమనం కారణంగా మంచి జరుగుతుంది. బృహస్పతి తిరోగమనం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో బాగా డబ్బు సంపాదిస్తారు. ఈ కాలం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారు కూడా ఉన్నతాధికారుల నుండి మన్ననలు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది. అన్ని విషయాలలోనూ సానుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications