2025లో వీరింటికి సంపదల ఖజానా.. నా మాటే శాసనమన్న బృహస్పతి!
2025లో ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశులవారి జీవితాలలో ఊహించని మార్పులకు కారణం కానున్నాయి. 2025 మే నెలలో బృహస్పతి బుధ గ్రహం పాలించే రాశి అయిన మిధున రాశిలోకి వెళ్తాడు. మిధున రాశిలో బృహస్పతి సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. సహజంగా ధనాన్ని, వివాహ వరాన్ని, సంతాన ప్రాప్తిని, సౌభాగ్యాలను కలిగించే బృహస్పతి 2024 మే మూడవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేశాడు.
మిధున రాశిలోకి బృహస్పతి
ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలోనే కొనసాగుతున్నాడు. మళ్ళీ మే 2025లో బృహస్పతి మిధున రాశిలోకి సంచరిస్తాడు. మిధున రాశిలో బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి విశేషమైన ధనయోగం కలుగుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
2025 లో మేష రాశి వారికి బృహస్పతి సంచారం లాభదాయకంగా ఉంటుంది. మేషరాశిలో గురుగ్రహం మూడవ ఇంట్లో సంచరిస్తుంది దీనివల్ల మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశం వస్తుంది. ఇది మేషరాశి జాతకులకు శుభ సమయం.
సింహరాశి
2025లో బృహస్పతి సంచారం కారణంగా సింహ రాశి వారికి కలిసి వస్తుంది. 2025లో బృహస్పతి సింహరాశిలో 11వ ఇంట్లో సంచరించడం వల్ల వీరికి వృత్తిపరమైన లాభాలు వస్తాయి. అధికారుల నుండి మన్ననలు పొందుతారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. వారసత్వ ఆస్తుల సమస్యలు పోతాయి. చాలా కాలంగా రాకుండా పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది సింహ రాశి వారికి అదృష్ట కాలం.
మిధున రాశి
2025లో బృహస్పతి మిధున రాశిలో సంచరించడం వల్ల మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార వృద్ధి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మిధునరాశి వారి జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications