త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. అయితే మే నెలలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు వృషభ రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని ఫలితంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి అఖండ ధన యోగం కలుగుతుంది. ఇక ఈ గురు శుక్ర సంయోగానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బృహస్పతి శుక్ర గ్రహాల సంయోగం
బృహస్పతి మరియు శుక్రుడు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో సంయోగం చెందబోతున్నాయి. దేవతలకు అధిపతి అయిన బృహస్పతి మే 1వ తేదీన వృషభ రాశిలో సంచరిస్తాడు. మే 19వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి వస్తాడు. ఇక ఈ సమయంలో రెండు గ్రహాలు సంయోగం చెందబోతున్నాయి.

కొన్ని రాశుల వారికి అదృష్టం
ఈ శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి అదృష్టం మేల్కొంటుంది. మరికొందరికి వారి ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి సంపద, ఐశ్వర్యం, విలాసాలు ఇచ్చే గ్రహంగా పేరుంది ఇక బృహస్పతి జ్ఞానం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతను పెంచే గ్రహంగా పేరుంది. ఇక ఈ రెండు గ్రహాల కలయిక చాలా మేలు చేస్తుంది.
మేషరాశి
మేష రాశి వారికి గురు శుక్ర గ్రహాలు కలయిక అదృష్టాన్ని ఇస్తుంది. వారి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఊహించని, ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గురు శుక్ర సంయోగం మంచి ఫలితాలను చేకూరుస్తుంది. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో కెరీర్లో పురోగతి ఉంటుంది. మీడియా, ఫిల్మ్, మోడలింగ్, రైటింగ్ మరియు క్రియేటివిటీ రంగాలలో పనిచేసే వారు గొప్ప లాభాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వివాహ యోగం ఉంది. కుటుంబంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ వాతావరణంలో సంతోషాలు వెల్లి విరుస్తాయి
సింహరాశి
సింహరాశి జాతకులు గురు శుక్ర సంయోగం వల్ల ప్రయోజనం పొందుతారు. వర్తక వ్యాపారాలలో, పురోగతి ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో సంబంధం మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications