నవంబర్ లో లక్ష్మీ నారాయణ రాజయోగం మోసుకొస్తుంది వీరికి సంపదల సౌభాగ్యం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి తర్వాత అనేక గ్రహ సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడతాయి. ఇక దీపావళి తర్వాత ఏర్పడే రాజ యోగాలో లక్ష్మీనారాయణ రాజయోగం ఒకటి. ఈ లక్ష్మీనారాయణ రాజయోగం తో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
నవంబర్ లో లక్ష్మీ నారాయణ రాజయోగం
లక్ష్మీ నారాయణ రాజయోగం నవంబర్లో వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారి కెరీర్లో పురోగతికి, గణనీయమైన ఆదాయ అభివృద్ధికి దారితీస్తుంది. మరి లక్ష్మీనారాయణ రాజయోగం తో అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల వారెవరో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ఈ సమయంలో వీరి పంట పండుతుంది.

మేషరాశి
దీపావళి తర్వాత వచ్చే లక్ష్మీనారాయణ రాజయోగం మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాజయోగం మేషరాశిలో అదృష్ట గృహంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీరు దేశ విదేశాలలో పర్యటించేందుకు అవకాశం కలుగుతుంది. కెరీర్లో వేగవంతమైన పురోగతి కనిపిస్తుంది. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మీరు మతపరమైన కార్యక్రమాలలో లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహరాశి
లక్ష్మీనారాయణ రాజయోగం తో సింహ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రాజయోగం సింహ రాశి లోని నాలుగవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల సింహరాశి జాతకులు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. సింహ రాశి వారు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి సంబంధిత పనులు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
దీపావళి తర్వాత వచ్చే లక్ష్మీనారాయణ రాజయోగం వృశ్చిక రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాజయోగం వృశ్చిక రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది అందువల్ల ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది .ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతాయి. వివాహితులు మంచి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications