వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చండీ 'వ్రతం'తో దోషాలు దూరం.. కార్యాలు దిగ్విజయం కావాలంటే ఏం చేయాలంటే?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు -హైదరాబాద్ - ఫోన్: 9440611151

త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళ చండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడు, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి పోవటంతో పాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన ఈ పూజా విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజ గ్రహ దోషాలు తొలగి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయి.

Lord Shivas favourite pooja Chandi Vratam

శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ , కోర్టు సమస్యలు , సంసారంలో గొడవలు , అనారోగ్య సమస్యలు , కోపం , అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

మంగళ చండీ స్తోత్రం

ద్యానమ్:-

దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్.
శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్.
సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.

శ్రీ మహాదేవ ఉవాచ:-

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

మంగళ చండి పారాయణం ఎవరు చేయాలి :-

దుర్గకి పార్వతికి మరో పేరు మంగళ చండిక . చండిక రూపంలో త్రిపురాసుర సంహారం చేసింది. మను వంశపు రాజు అమ్మవారికి పూజ చేసాడు. కుజ దోష నివారణకు అమ్మవారిని పూజ చేయాలి . అమ్మవారిని పూజ చేయడం వలన కుజ దోష నివారణ జరుగుతుంది.

శత్రువులు పీడ పోవడానికి , ప్రతి ఆడ పిల్ల నిత్య సుమంగళిగా ఉండుటకు కుజ దోషం ఉన్న వాళ్లు మంగళ చండి పూజ చేయుట శుభం . కుజ దోషం పోవడానికి ప్రతి మంగళవారం మంగళ చండి పారాయణం , మంగళ చండీ స్తోత్రం చదువుకోవాలి . ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి నవగ్రహలకు 7 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా పువ్వులు , పళ్ళు దానం చేసి ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేయాలి . ఈ విధంగా చేయటం వలన వారికి సర్వ శుభాలు జరుగుతాయి.

మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా చండీ హోమం చేయించుకొండి సర్వం విజయం కలుగుతుంది ,శత్రు భాదలు తొలగిపోతాయి .ఏవైతే భక్తీ శ్రద్దలతో చండీ దేవిని పూజిస్తారో వారికి అఖండ విజయం సుఖసౌక్యాలు కలుగుతాయి .

English summary
Lord Shiva's Chandi Vratam keep away from bad things. This pooja is remedy for all problems including Kuja Dosham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X