ఆగస్టులో వీళ్ళకు లక్ అన్‌లాక్ అయ్యింది...సంపదల వర్షం మొదలైంది!
ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో నవగ్రహాలలోని ముఖ్య గ్రహాలు రాశులలో తమ సంచారాన్ని సాగిస్తున్నాయి. ముఖ్యంగా గురువు ఆగస్టు మాసంలో నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. గురువు కదలికలలో రెండుసార్లు మార్పు రాబోతుంది. ఆగస్టు 13వ తేదీన గురువు పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో సంచరిస్తే, ఆగస్టు 30వ తేదీన గురువు పునర్వసు నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తాడు.
గురువు నక్షత్ర సంచారంతో లాభపడే రాశులు
గురువును దేవతలకు గురువుగా చెప్తారు. లగ్నంలో గురువు ఉన్న జాతకుడు అదృష్టవంతుడుగా చెప్పబడతాడు. అంతేకాదు సౌందర్యవంతుడు, నిర్భయుడు, సంతానవంతుడు, చీరంజీవి అవుతాడని చెప్తారు. గురువు కదలికలో మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
గురువు నక్షత్ర సంచారంలో మార్పుల కారణంగా మేష రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి వారు కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థిక పురోగతికి ఇది దారితీస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురువు సంచారం కారణంగా కలిసి వస్తుంది. జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు. భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషదాయకం గా సాగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు తొలగిపోయి అంతా ప్రశాంతంగా జరుగుతుంది.సరిగ్గా
మీన రాశి
గురువు నక్షత్ర మార్పు మీన రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీన రాశి జాతకులు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపుతారు. మీన రాశి వారి ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీన రాశి వారు శుభవార్తలు వింటారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications