సింహరాశి వారికి మార్చి నెల లాభిస్తుందా? ఈ ఒక్క అంశంలో వీరికి తిరుగుండదు!!
సింహరాశి వారికి మార్చి నెలలో ఒక్క అశంలో బాగా లాభిస్తుంది. ఆర్ధిక, ఆరోగ్య, వృత్తి, ఉద్యోగ విషయాలలో ఈ విధంగా ఉంటుంది.
మార్చి నెల సింహ రాశి జాతకులకు కలిసి వస్తుందా? సింహ రాశి వారికి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

సింహరాశి వారికి మార్చి నెల ఎలా ఉంటుంది?
సింహరాశికి సూర్యుడు అధిపతి. రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి జాతకులకు మార్చి నెల కాస్త ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పబడింది. కొన్ని శుభ, అశుభ ఫలితాలతో సింహరాశి జాతకులకు ఈ నెల మిశ్రమంగా ఉంది. ఈ నెలలో సింహరాశి జాతకులకు వృత్తిపరమైన సమస్యలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. సింహరాశి జాతకులు ఉద్యోగాలలో కూడా ఈనెల ప్రధమార్ధం అంతా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ద్వితీయార్థంలో కొంతమేర పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అధికారుల నుండి కావలసిన మద్దతు లభిస్తుంది. చేసిన పనికి అధికారం నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు.

ఉద్యోగాలు, వ్యాపారాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చా?
మార్చి నెలలో సింహరాశి జాతకులు అనేక ఎదురు దెబ్బలు తినే అవకాశం కనిపిస్తుంది. ఇక అటువంటి సమయంలో కూడా సానుకూల దృక్పథాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించబడింది. సహ ఉద్యోగులతోనూ, ఉన్నతాధికారులతోనూ విభేదాలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే వృత్తిపరంగా మార్పులకు ఇది సరైన సమయం కాదని, సంయమనం తో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పబడింది.

ఆర్ధిక విషయాల్లో ఎలా ఉంటుంది?
ఇక ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని ఖర్చులు ఎదురై డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమమైన సమయం కాదని చెప్పబడింది. భాగస్వామ్య వ్యాపారాలు చేయడానికి కూడా ఇది అనుకూల సమయం కాదని చెబుతున్నారు. డబ్బుల విషయాలలో జాగ్రత్త అవసరం, లేదంటే తీవ్ర ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

కుటుంబ జీవితం, ఆరోగ్యం ఎలా ఉంటుంది?
సింహరాశి జాతకులకు ఈ నెలలో కాస్త ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంది. కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి, కుటుంబ సభ్యులతో కాసేపు గడపటానికి సమయం కేటాయిస్తే కొంతమేరకు ఆందోళనల నుండి మనసు మరల్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు శాంతియుత మరియు సామరస్య పూర్వకమైన ఇంటి వాస్తవరణాన్ని సృష్టించడానికి మీరు దృష్టి సారిస్తే కుటుంబ సభ్యుల ప్రేమతో పాటు మద్దతు కూడా లభిస్తుంది. విపరీతమైన మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలకు ఈ మాసంలో గురయ్యే అవకాశం ఉన్నందున, ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించబడింది.

విద్య విషయంలో సింహరాశి వారికి సరైన సమయమేనా?
ఇక విద్యార్థుల విద్య విషయంలో సింహరాశి జాతకులకు ఈనెల బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యలో గణనీయమైన ప్రగతిని సాధిస్తారు. విద్యకు సంబంధించిన అనేక విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పబడింది. ఏది ఏమైనా ఏది ఏమైనా విద్యార్థుల విద్యకు సంబంధించి తప్ప మిగతా అన్ని విషయాలలోనూ సింహరాశి జాతకులకు ఈ నెల కలిసి రావడం లేదని చెప్పాలి. అందుకే జాగ్రత్త.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications