తిరోగమనంలో ఉన్నాసరే జనవరి 20వరకు వీరికి సంపదల కుంభవృష్టి కురిపిస్తున్న కుజుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి తమదైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడంతో పాటు ఒక్కోసారి తిరోగమనములో ప్రయాణం చేస్తాయి. కొన్నిసార్లు అస్తమించడం మరికొన్నిసార్లు ఉదయించడం కూడా చేస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు డిసెంబర్ 7వ తేదీన తిరోగమన సంచారాన్ని మొదలుపెట్టాడు.
కర్కాటక రాశిలో కుజుడి తిరోగమనం
కుజుడు జనవరి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో తిరోగమనంలోనే సంచరిస్తాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆయా రాశుల వారు కుజుడి తిరోగమనం కారణంగా అనేక ఆర్ధిక లాభాలను, సుఖ సంతోషాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
కర్కాటక రాశిలో కుజుడు తిరోగమన సంచారం కారణంగా మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మేష రాశి వారిని కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. గతంలో చేసిన ప్లాన్స్ ఇప్పుడు మేష రాశి వారికి పురోగతిని ఇస్తాయి. మేషరాశి జాతకుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగానూ పురోగతిని సాధిస్తారు.
సింహరాశి
కుజుడు తిరోగమన సంచారం కారణంగా సింహ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు అంతులేని ప్రయోజనాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఈ సమయంలో సింహ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి
కుజుడి తిరోగమన సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. 2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పోయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో స్నేహితుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ధనస్సు రాశి వారికి విజయాలను అందిస్తాయి. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications