త్వరలోనే వీరు మల్టీ మిలియనీర్లు అవుతారని ప్రకటించిన బుధుడు!
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి గ్రహాల రాకుమారుడిగా ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు వాక్కు, బుద్ధి, వ్యాపారం మొదలైన వాటికి అధిపతిగా చెబుతారు. అటువంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు.
వృషభరాశిలోకి బుధుడు
ఇదే క్రమంలో మే 7వ తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. మే 23వ తేదీన బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు .వృషభ రాశిలో బుధ సంచారం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. 2025 మే 23న వృషభ రాశిలోకి బుధ సంచారం కారణంగా లబ్దిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
బుధసంచారం కర్కాటకరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది, ఈ రాశి వారి 11వ గృహం లో బుధ సంచారం జరగడం వల్ల వీరికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఎంతోకాలంగా ఆగిపోయిన పెండింగ్ పనులు ప్రాజెక్టులు మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. ఆదాయ స్థాయిలలోనూ గణనీయమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లోను పురోగతి ఉంటుంది.మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అవివాహితులకు కొత్త వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కన్యారాశి
వృషభ రాశిలో బుధ సంచారం కన్య రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. బుధుడు లగ్న గృహానికి, పదవి ఇంటికి అధిపతి కావడంతో పాటు, వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం కలిసి వస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు బుధ సంచారం కలిసి వస్తుంది. బుధుడు కుంభరాశి 5వ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి. కుంభ రాశిలో బుధుడు నాలుగవ ఇంట్లో సంచారం చేస్తాడు. ఈ సమయంలో కుంభ రాశి జాతకులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్నవారు బహుళ ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబంతో కుంభరాశి వారి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. స్థిరాస్తులు పొందే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications