వీరింట 64రోజులు అదృష్టలక్ష్మి తాండవం ఖాయం చేసిన బుధుడు!

నవగ్రహాల్లో బుధ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాల రాకుమారుడు గా చెప్పే బుధుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. ప్రస్తుతం వృశ్చిక రాశిలో కొనసాగుతున్న బుధుడు జనవరి 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ కొన్ని రాశుల వారికి అఖండ ధన యోగాన్ని వరంగా ఇస్తున్నాడు.

64 రోజులు బుధ సంచారం
సహజంగా ఏ రాశిలో అయినా మూడు వారాలకు మించి సంచరించని బుధుడు ఈసారి వృశ్చిక రాశిలో 64 రోజులు పాటు సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను ఆర్థిక లాభాలను కలిగిస్తున్నాడు . జనవరి నాలుగో తేదీ వరకు బుధ సంచారంతో అదృష్టం కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mercury is giving wealth to these zodiac signs for 64 days

వృషభరాశి
వృషభ రాశి వారికి వృశ్చిక రాశిలో బుధ గ్రహ సంచారం కలిసివస్తుంది. జనవరి 4వ తేదీ లోపు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పెళ్ళికాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశిలో బుధ సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులకు ఆస్తి, గృహ సంబంధిత విషయాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహరాశి
వృశ్చిక రాశిలో బుధ సంచారం సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కొత్త గృహాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక పూర్వీకుల ఆస్తులపైన సమస్యలు తొలగిపోయి ఆర్థిక పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని చేసే చోట గౌరవం లభిస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధసంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయం లో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి నిజంగానే అదృష్ట సమయం.

మకర రాశి
మకర రాశి జాతకులకు బుధ సంచారం కారణంగా అదృష్ట లక్ష్మి వరిస్తుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. సామాజికంగా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి .ఉద్యోగం చేసే వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఇది మకర రాశి జాతకులకు కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం.

కుంభరాశి
కుంభ రాశి వారికి బుధుడు వృశ్చిక రాశి సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో అన్ని విషయాలలోనూ విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూల ఫలితం వస్తుంది .ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. కుంభ రాశి వారికి ఇది అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+