రెండు రోజుల్లో వీరికి డబ్బుల మూటలను ఇవ్వటానికి సిద్ధం చేసిన బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు జ్ఞానానికి, కమ్యూనికేషన్ ను ప్రభావితం చేసే ప్రధాన గ్రహాలలో ఒకటిగా చెబుతారు. కన్యరాశిని, మిధున రాశిని పాలించే గ్రహమైన బుధుడు సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.
తులారాశిలో బుధ సంచారం
ఈనెల అక్టోబర్ 10వ తేదీన ఉదయం 11 గంటల 9 నిమిషాలకు తులా రాశిలో బుధ సంచారం జరగబోతుంది. అక్టోబర్ 22న బుధుడు తులారాశిలో ఉదయిస్తాడు. తులారాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
బుధుడు మిధునరాశిలో ఒకటవ మరియు నాలుగవ గృహాలను పరిపాలిస్తాడు. ప్రస్తుతం బుధుడు అయిదవ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ కారణంగా బుధ సంచారం మిధున రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన విజయం సాధించగలుగుతారు. మీలో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.
కన్య రాశి
కన్య రాశిలో బుధుడు ఒకటవ ఇంటిని, పదవ ఇంటిని పాలిస్తాడు. ప్రస్తుతం బుధుడు కన్యారాశిలో రెండవ ఇంటికి వెళుతున్నాడు. దీని కారణంగా కన్యా రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీరు పదోన్నతులు పొందుతారు. వీరి వేతనాల పెరుగుదల జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈ సమయంలో కన్యా రాశి జాతకులు ఉత్సాహంగా ఉంటారు. బిజినెస్ చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. ఆర్థికంగాను బలోపేతం అవుతారు.
తులారాశి
తులా రాశిలో బుధుడు తొమ్మిదవ మరియు 12వ ఇంటిని పాలిస్తాడు. తులా రాశిలో బుధ సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో బుధుడు ఒకటవ ఇంట్లో ఉంటాడు ఈ కారణంగా తులా రాశి వారు అధిక ప్రయోజనాలను పొందుతున్నారు. వర్తక వాణిజ్యాలు చేసేవారు విజయాలు సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది లాభదాయకమైన సమయం. ఆర్థికంగా ఈ సమయంలో మీరు బలోపేతం అవుతారు.
కుంభరాశి
కుంభరాశిలో బుధుడు ఐదవ మరియు 8వ ఇంటిని పాలిస్తాడు. ఈ సంచార సమయంలో బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో కుంభరాశి జాతకుల జీవన స్థాయి మెరుగు పడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువ దృష్టి సారిస్తారు. పూర్వీకుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగం చేసే వారికి వ్యాపారం చేసే వారికి ఇది అదృష్ట సమయం. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
మకర రాశి
బుధుడు మకర రాశిలో ఆరవ మరియు తొమ్మిదవ ఇంటిని పాలిస్తాడు. ఈ సంచార సమయంలో ప్రస్తుతం బుధుడు పదవ ఇంట్లోకి వెళుతున్నాడు. ఈ కారణంగా బుధ సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది .ఈ సమయంలో మకర రాశి జాతకులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకమైన సమయం. ఈ సమయంలో శత్రువుల పైన విజయం సాధిస్తారు. నూతన వ్యాపార ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇది మీకు అపారమైన ఆదాయాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications